Minister KTR: ప్రవళిక ఫ్యామిలీ నన్ను కలిసింది.. ఆమె తమ్ముడికి ఉద్యోగం ఇస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రవళిక కుటుంబం తన దగ్గరకు వచ్చారని తెలిపారు. ప్రవళికను కొందరు వేదించారని చెప్పారని అన్నారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చామని తెలిపారు. ప్రవళిక తమ్మునికి ఉద్యోగం ఇస్తామని చెప్పామని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ మంత్రి మంత్రి మాట్లాడుతూ.. మరోసారి తెలంగాణలో కేసీఆర్ కి అవకాశం ఇవ్వాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పదేళ్ళలో ఎన్ని మార్పులు వచ్చాయన్నారు.
మానేరు నీళ్లకోసం జరిగిన కొట్లాటలు ఇంక కళ్లముందే ఉన్నాయని తెలిపారు. నేడు ఆ పరిస్థితి మారింది..కాళేశ్వరంతో కరీంనగర్ జిల్లా అంత సజీవ జలధారగా మారిందన్నారు. అభివృద్ధికి తోడు సంక్షేమం దీటుగా సాగుతుందని తెలిపారు. కమలాకర్ నాయకత్వంలో బీసీ సంక్షేమం అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. చదువుకునేందుకు గురుకులాలు, విదేశాలకు పోయేవాళ్ళకి కూడా అండగా ఉన్నామన్నారు. హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టె సన్నాసులు కరీంనగర్ లో ఉన్నారని తెలిపారు. కమలాకర్ చేతిలో చావు దెబ్బ తిని దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అయ్యాక కరీంనగర్ కి ఏం చేశారు? ఓ బడి తేలేదు… కనీసం గుడి అయినా తేలేదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాకర్ అన్నపై పోటీ చేసేందుకు అందరూ జంకుతున్నారని మంత్రి అన్నారు.
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి
కాంగ్రెస్ వాళ్లు హుస్నాబాద్ పారిపోయారు.. బీజేపీ వాళ్ళు పోటీకి వెన్క ముందాడుతున్నారంటూ మంత్రి తెలిపారు. గంగుల మీద పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అంటూ కేటీఆర్ అన్నారు. మోడీ దేవుడన్న అంటున్న బండి సంజయ్ చెప్పాలి గ్యాస్ ధర ఎంత పెరిగిందో? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ అందరి నాయకుడు.. హిందూ ముస్లిం అందరికి నేత అన్నారు. కేసీఆర్ గొప్ప హిందువు… యాగాలు యజ్ఞాలు చేశారని, నిజమైన హిందువు ఎవర్ని తిట్టడని అన్నారు. ఇక్కడ ఎంపీ మసీదులు తవ్వుదాం అంటాడు… బొందల గడ్డలు తవ్వడానికా ఎంపీ అయింది సంజయ్ అంటూ మండిపడ్డారు. పునాదులు తవ్వండి.. అభివృద్ధి కోసం పునాదులు వేయండని అన్నారు. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ ఒకవైపు… తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన బీజేపీ కిషన్ రెడ్డి, ఓటుకు నోటు దొంగ థర్డ్ క్లాస్ క్రిమినల్ రేవంత్ రెడ్డి ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీమా పథకం తెస్తున్నాం.. అధికారం ఇవ్వండి.. ఆర్నెళ్లలో అమలు చేస్తామన్నారు.
కమలాకర్, కేసీఆర్ కి చెప్పినట్టు… రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేయబోతున్నామన్నారు. 15 లక్షల పరిమితితో కేసీఆర్ ఆరోగ్య రక్ష ఇస్తామన్నారు. ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి కుటుంభం నా దగ్గరకు వచ్చారు.. వారి అమ్మాయిని వేధించారని చెప్పారని తెలిపారు. వారికి న్యాయం చేస్తాం.. ఆ అమ్మాయి తమ్మునికి ఉద్యోగం ఇస్తామని చెప్పామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ వస్తాడు.. ప్రియాంక వస్తుంది.. మోసపోకండి… కార్ గుర్తుకు ఓటేసి కేసీఆర్ ని దీవించండి అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Story Board: ఎన్నికలంటే డబ్బేనా.. ఒక్క నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చా..?
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?