Site icon NTV Telugu

Prashanth reddy: నిఖత్ జరీన్ కు వ్యక్తిగతంగా రూ. లక్ష ప్రోత్సాహం

Nikhat Zareen

Nikhat Zareen

నిఖత్ జరీన్ విజయం తెలంగాణ కే గర్వకారణం అని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం హర్షణీయని అన్నారు. జరీన్ ఘన విజయంతో తెలంగాణ, నిజమాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలు, ప్రపంచం నలుదిశలా మరింతగా వ్యాపించనున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం క్రీడలు,క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రోత్సహిస్తున్నది చెప్పడానికి జరీన్ విజయమే అందుకు నిదర్శనమని..నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమైన జరీన్ కు వ్యక్తిగతంగా లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం అందిస్తా అని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నిఖత్ జరీనాకు అన్ని రకాల సహాయ సహకారాలు,ప్రోత్సాహం అందేలా చొరవ తీసుకుంటానని జరీన్ కు, ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, జిల్లా ప్రజలకు బాక్సింగ్ అసోసియేషన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

నిఖత్ జరీనా టర్కీ ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుని వరల్డ్ ఛాంపియన్ గా నిలిచారు. థాయ్ లాండ్ కు చెందిన జిత్పోంగ్ జుటామాను ఓడించింది నిఖత్ జరీన్. భారత్ తరుపున గతంలో మేరికోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ సీ మాత్రమే ఈ టోర్నిల్లో ఛాంపియన్లుగా నిలిచారు. ప్రపంచ టైటిల్ సాధించిన ఐదో భారతీయ మహిళగా నిఖత్ రికార్డు సృష్టించింది.

 

Exit mobile version