Prashanth Reddy : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు యూరియా కోసం విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “వరి పొట్ట దశలో ఉంది. వారం రోజుల్లో యూరియా రాకపోతే రైతుల దిగుబడి తీవ్రంగా పడిపోతుంది. రైతు ప్రభుత్వం అంటూనే రైతులను ముంచుతున్నారు” అని ఆయన అన్నారు.
AI Boost CIBIL Score: క్రెడిట్ స్కోర్‌కు AI మైలేజ్.. ఓ లుక్ వేయండి
సీఎం రేవంత్ రెడ్డిని ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. “రేవంత్ రెడ్డి మాటలు బుడ్డ ర్ ఖాన్ మాటల్లా ఉన్నాయి. అబద్ధపు హామీలే తప్ప రైతులకు ఎలాంటి సహాయం చేయడం లేదు. కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపించాలన్న ఆలోచన తప్ప రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన విమర్శలు చేశారు.
“రెండు లక్షల 20 వేల కోట్ల అప్పులు చేసి రోడ్లపై ఉన్న ఒక గుంత కూడా పూడ్చలేదు. నాలుగు లక్షల కోట్లతో ఎక్కడైనా ఒక్క ప్రాజెక్ట్ కట్టావా? ఒక బ్రిడ్జ్ అయినా కట్టావా?” అని ప్రశ్నించారు. రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని, లేకుంటే రైతులతో పాటు మహిళలను తీసుకుని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. “కబర్దార్… ఇక మౌనంగా ఉండం” అని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
