తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో హతుడి మామ అమృతరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఆ కేసులో మరో నిందితుడు అబ్దుల్ బారీకి గుండె నొప్పి రావడంతో అతడిని నిమ్స్ కు తరలించారు జైల్ అధికారులు. గుండె నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించామని, చికిత్స జరుగుతోందని జైలు అధికారులు తెలిపారు.
ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీ రావుకు సుపారీ గ్యాంగ్ ను సమకూర్చి పెట్టాడు రౌడీ షీటర్ అబ్దుల్ బారీ. ప్రస్తుతం నల్గొండ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు అబ్దుల్ బారీ. 2018 సెప్టెంబర్ లో తన కూతురిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడని ప్రణయ్ ను దారుణంగా హత్య చేసింది ముఠా. గర్భవతిగా ఉన్న అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రణయ్‌పై దుండగులు కత్తితో దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ప్రణయ్ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మారుతీరావుతో పాటు అతడికి సుపారీ గ్యాంగ్‌ను సమకూర్చిన రౌడీషీటర్ అబ్దుల్ బారీ సహా నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.2020 మార్చిలో హైద్రబాద్ లోని ఆర్యవైశ్య గెస్ట్ హౌస్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అమృత తండ్రి మారుతీరావు.
పది రోజుల క్రితం సాధారణ చెకప్ లో భాగంగా అబ్డుల్ బారీని ఉస్మానియాకు అక్కడినుండి గాంధీకి అక్కడి నుండి నిమ్స్ కు తరలించారు. గుండె సంబంధిత వైద్యాన్ని ప్రణయ్ హత్య కు ముందు నుంచే పొందుతున్నాడని జైలు అధికారులు ధ్రువీకరించారు.
