Site icon NTV Telugu

CM Revanth Reddy: నేడు ఉదయం జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజాదర్బార్‌.. ప్రజాసమస్యలపై చర్చ

Revanthreddy Cm

Revanthreddy Cm

CM Revanth Reddy: ఇవాళ ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజా దర్బార్‌ నిర్వహించనున్నానని ప్రలందరూ ఆహ్వానితులే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా.. ప్రగతి భవన్.. జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజాభవన్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రజా భవన్ గేట్లు తెరిచి ఉన్నాయి. దశాబ్దం తర్వాత సామాన్యుడి అడుగులు పడిపోయాయి. నేడు ప్రజాభవన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజా సమస్యలను సీఎం రేవంత్ స్వయంగా పరిష్కరిస్తారు. సీఎంగా పాలనా పగ్గాలు చేపడుతూ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ బేగంపేటలో ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ ఎదుట రోడ్డుపై వేసిన ఇనుప కంచెను తొలగించాలని ఆదేశించారు. ప్రమాణస్వీకారం అనంతరం అదే వేదికపై నుంచి ప్రగతి భవన్‌ కంచెను తొలగిస్తామని రేవంత్‌ ప్రకటించారు. ఒకవైపు రేవంత్ ప్రమాణస్వీకారం, మరోవైపు ముఖ్యమంత్రి అధికార నివాసం ముందున్న కంచె తొలగింపు ఒకేసారి జరిగాయి.

Read also: Chandrababu: వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

గ్యాస్ కట్టర్లతో ఐరన్ గ్రిల్స్ కట్ చేసి తొలగించారు. దీంతో ఇక్కడ రోడ్డు వెడల్పు చేసింది. ప్రగతి భవన్‌కు బదులుగా జ్యోతిరావు ఫూలేను ప్రజాభవన్‌గా మారుస్తామని రేవంత్‌ ప్రకటించారు. ప్రజా భవన్‌కు ఎవరైనా రావచ్చని, ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేటి నుంచి ప్రజాదర్బార్ నిర్వహించనున్నామని, దీన్ని పెద్దఎత్తున విజయవంతం చేయాలని సీఎం రేవంత్‌ని కోరారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉదయం పూట నేరుగా ప్రజలను కలుస్తుండేవారు. అపాయింట్‌మెంట్ లేకుండా ఎవరైనా తమ సమస్యను పేపర్‌పై రాసి నేరుగా సీఎంకు అందజేయవచ్చు.. అదే ప్రజాదర్బార్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థ నిలిచిపోయింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ప్రజాదర్బార్‌ను కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ప్రజా దర్బార్ ఉంటుందని, ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరూ రావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇవాళ ప్రజాదర్భార్ కార్యక్రమంలో సీఎం ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించనున్నారు. వారు అడిగే ప్రశ్నలకు ఏవిధంగా సమాధానం ఇవ్వనున్నారు అనేది విషయంపై కొద్దిగంగలు ఆగాల్సిందే మరి.
Nithiin: ఎక్స్ట్రాడినరీ మాన్ ట్విటర్ రివ్యూ…

Exit mobile version