K.A.Paul: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు మిన్నంటుతున్నాయి. మహిళలు ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో.. బతుకమ్మ పండుగలో రాజకీయ ప్రముఖులు సైతం హాజరై మహిళలతో బతుకమ్మ ఆడుతూ ప్రజలను హుత్సాపరుస్తున్నారు. కాగా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా బతుకమ్మ ఆడారు. మునుగోడులో పర్యటించిన పాల్ తన కోడలు జ్యోతి బెగల్ తో కలిసి చౌటుప్పల్ వచ్చి స్థానిక మహిళలతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. మహిళలతో బతుకమ్మ పాటకు స్టెప్పులేస్తూ అందరిని ఉత్సాహపరిచారు. అక్కడున్న వారందరితో సరదాగా కాసేపు గడిపారు. ఆటపాటలతో అందరితో కలిసి బతుకమ్మ పాటకు చప్పట్లు కొడుతూ కేఏపాల్ బతుకమ్మ ఆడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది… బతుకమ్మ ఆడుతున్న కేఏపాల్ అంటూ కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరొకొందరు తీవ్ర వ్యాఖ్యలతో విమర్శిస్తున్నారు. ఇక మరికొందరేమో కేఏ పాల్‌ది విచిత్ర మనస్తత్వమని చెబుతూ సెటైరిక్ కామెంట్లు చేస్తున్నారు. రవి కొండపల్లి అనే ఓ నెటిజన్ అన్నా పార్టీ గుర్తింపు రద్దు చేసింది ఎలక్షన్ కమీషన్ అంటున్నారు నిజమేనా? అదే నిజమైతే మీరు అమెరికా అద్యక్షుడితో మాట్లాడి రష్యాతో యుద్ధం చేసి చైనాతో శాంతి చర్చలు జరపాలి. అప్పుడే ఎలక్షన్ కమీషన్ మీ కాలిబర్ చూసి భయపడుతుంది అంటూ తనదైన శైలిలో సెటైర్ సంధించారు.
Read also: LIVE : దేవీ నవరాత్రులలో 3వ రోజు ఈ స్తోత్రాలు వింటే సకల మంత్ర సిద్ధి తేజస్సు, జ్ఞానము పొందుతారు
ఈనెల 25న మునుగోడులో కేఏపాల్ 59వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టిరోజు సందర్భంగా తాను చెప్పినట్లుగానే 59 మందికి వీసా లక్క్కీడ్రా తీశారు. డ్రాలో గెలుపొందిన వారిని అమెరికా పంపించనున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక బీసీ కుటుంబంలో పుట్టి, దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న తనకు.. నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని సీఎం కేసీఆర్, సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పి.. ఇంతవరకూ ఆ హామీల్ని నెరవేర్చలేదని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న రాష్ట్రాన్ని ప్రభుత్వం అప్పులపాలు చేసిందన్నారు. అయితే.. ఉపెన్నికల్లో కోసం పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించినా టీఆర్‌ఎస్ ఇంకా ప్రకటించాలేదని గుర్తు చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా.. తమ అభ్యర్థిని గెలిపిస్తే ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తానని.. నియెజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు కేఏపాల్. ప్రధాన పార్టీలన్నీ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో బీజీగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టాయి. ఇక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా ఈ ఉపఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
UN Security Council: ఐరాస భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత స్థానం కల్పించేందుకు శ్రీలంక మద్దతు
