NTV Telugu Site icon

TSPSC Group-4: గ్రూప్‌-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

Tspsc Group 4

Tspsc Group 4

TSPSC Group-4: తెలంగాణలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్‌-4 ఉద్యోగాలకు నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. నేటి నుంచి ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. సాంకేతిక కారణాలతో దరఖాస్తుల ప్రక్రియ వాయిదా వేసినట్లు వెల్లడించింది. మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9,168 పోస్టులకు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. త్వరలో గ్రూప్‌-2, 3 పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు TSPSC కసరత్తు పూర్తి చేసింది.

Read also: Government Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. మరో రెండో నోటిఫికేషన్లు..

నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభం కానుంది. ప్రభుత్వంలోని మొత్తం 25 వివిధ శాఖల పరిధిలో 9,168 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు డిసెంబర్ 30 నుంచి అంటే నేటి నుంచి జనవరి 19, 2023 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కమిషన్ ఈ మేరకు తెలిపింది. జిల్లాల వారీగా పోస్టులతో కూడిన సమగ్ర ప్రకటనతో పాటు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియకు పూర్తి ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు దాఖలుకు మూడు వారాల గడువు ఇచ్చారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుందని కమిషన్ ఇప్పటికే వెల్లడించింది.

Read also: Loan Money is Theft: ఫాలో అయ్యారు.. 13లక్షల డబ్బులు కొట్టేసారు

ఇది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించబడుతుంది. దీని ద్వారా 9,168 గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి మొత్తం ఉద్యోగాలలో ఎక్కువ భాగం. రెవెన్యూ శాఖ పరిధిలో 2077 పోస్టులు ఉన్నాయి. వీటిలో సీసీఎల్‌ఏ కింద 1,294 పోస్టులు కూడా ఉన్నాయి. సంక్షేమ గురుకులాలు, సాధారణ గురుకులాల్లో 1991 ఖాళీలు ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీసర్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులను ఈ గ్రూప్-4 ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.

Read also: Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

చాలా కాలం తర్వాత గ్రూప్-4 దరఖాస్తులు స్వీకరిస్తున్నందున, భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్ అంచనా వేస్తోంది. గత అనుభవాలను బట్టి చూస్తే కనీసం ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. నాలుగేళ్ల క్రితం 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్వో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించగా, పది లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 76 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. అంతేకాదు అంతకు ముందు గ్రూప్ ఫోర్ కేటగిరీలో రెండు వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడినప్పుడు కూడా 4.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండింటికి తోడు ప్రస్తుతం దాదాపు పది వేల పోస్టులు ఉండగా.. 9,168 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో.. అభ్యర్థులు ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తు చేస్తారని అంచనా వేస్తున్నారు.
Unstoppable 2: ముగ్గురు హీరోయిన్స్ తో బాలయ్య చేసిన సందడి చూసెయ్యండి