రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ కళాశాలలు ఇలా అన్ని విద్యాసంస్థలు జూలై 11 నుంచి 13 వరకు మూతపడనున్నాయి.
Read Also: Viral Video: ముసలోడి క్రియేటివిటీ మామూలుగా లేదు. చూస్తే నవ్వుతోపాటు కోపమూ ఆగదు.
ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలకు మూడు రోజులు సెలవులు ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో షెడ్యూల్ చేయబడిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించింది. వాయిదా వేసిన పరీక్షలను త్వరలోనే షెడ్యూల్ చేస్తామని.. తగిన సమయంలో ఓయూ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని యూనివర్సిటీ వెల్లడించింది. జూలై 14 నుంచి జరిగే పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపింది.
ప్రభుత్వ నిర్ణయంతో తాజాగా ఉస్మానియాతో పాటు కాకతీయ, తెలంగాణ, జేఎన్టీయూ యూనివర్సిటీలు కూడా తమ పరిధిలోని కళాశాలల్లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా జూనియర్ కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ విద్యా మండలి సర్క్యులర్ జారీ చేసింది.
