Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండగా.. చివరి రోజుల్లో నేతల ప్రచారంతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు హోరెత్తుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం (నవంబర్ 25, 2023) తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముగ్గురు బీజేపీ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ఈ ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు పాల్గొననున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఏమాత్రం తగ్గకుండా దూకుడు పెంచింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పవర్ టూర్లలో బిజీబిజీగా ఉన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఇవాళ ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉండగా… ఇవాళ రాహుల్ గాంధీ నిజామాద్ బోధన్‌లో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో బోధ్‌లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రాలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
Read also: Revanth Reddy: కేసీఆర్ ఓటుకి 10వేలు పంపాడు.. తక్కువ ఇస్తే అంగీ లాగు గుంజుకొండి
పోస్టర్లపై రాహుల్, రేవంత్ చిత్రాలను ముద్రించి ‘మా పిల్లల చావుకు కాంగ్రెస్సే కారణం’ అని రాశారు. అంతేకాదు, కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ బోధ్ టూర్‌కు వ్యతిరేకంగా పోస్టర్ కలకలం సృష్టించింది. తెలంగాణలో చాలా మంది బలిదానాలకు కాంగ్రెస్సే కారణమని పేర్కొన్నారు. కర్ణాటకలో ఉద్యోగాలు లేవని, ఉరివేసుకున్నారని రాశారు. కాంగ్రెస్ కు ఓటు వేసిన పాపానికి నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారని పోస్టర్లలో ముద్రించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమాగా ఉన్న నేతలు బీజేపీ, బీఆర్ఎస్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీలు తమ నేతలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు సంస్థలపై దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పై బీఆర్ ఎస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్, సీఎం కేసీఆర్‌పై ఎన్నికల్లో పోటీకి ఓకే చెప్పిన రేవంత్ రెడ్డి పోస్టర్లు కామారెడ్డిలో కలకలం రేపుతున్నాయి. ఈ పోస్టర్లు కూడా కుట్రలో భాగమేనని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
Golden Horses: బంగారు గుర్రాల గురించి ఎప్పుడైనా విన్నారా?.. వీటికి పెద్ద చరిత్రే ఉంది..
