NTV Telugu Site icon

Ponnam Prabhakar: నిధులిస్తానని చెప్పి కేసీఆర్ ప్రజలకు శఠగోపం పెట్టారు

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhaskar Comments On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి ధ్వజమెత్తారు. అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలని కేసీఆర్ చెప్పారని, మరి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఇప్పుడున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లన్ననీ అగ్గిపెట్టేలా చిన్నగా ఉన్నాయని విమర్శించారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యను ప్రజలలోకి తీసుకెళ్లిందుకే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నారు. 609వ నంలో ఉన్న అదానిని.. ప్రపంచంలో 9 స్థానానికి బీజేపీ తీసుకొచ్చిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రాకముందు ఉన్న అప్పు ఎంత? ఇపుడున్న అప్పు ఎంత? అని ప్రశ్నించారు.

Guntakal Mystery Cases: ఉలిక్కిపడ్డ గుంతకల్లు.. ఆ దారుణాలకు కారణమేంటి?

తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నట్టు.. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎక్కడ లేదని, 10 గంటలే వస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్ తీగలను పట్టుకోమన్న టీఆర్ఎస్ ఛాలెంజ్‌ని తాము స్వాగతిస్తున్నామని, కరెంట్ తీగల్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలు అనేక వేధింపులకు గురవుతున్నారన్నారు. వారిపై అక్రమ కేసులు పెట్టి, బైండోవర్లు చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వంత జాగీరేమీ కాదని తేల్చి చెప్పారు. శ్రీరామ్ సాగర ప్రాజెక్ట్ నీళ్లు తెలంగాణ నుంచి మహారాష్ట్రకు ఎలా పంపిస్తావని కేసీఆర్‌ని ప్రశ్నించిన ఆయన.. శ్రీరామ్ సాగర్‌లో చుక్క నీరు ముట్టినా రక్తపు మరకలేనంటూ వార్నింగ్ ఇచ్చారు. దేవాలయాలకు నిధులు కేటాయిస్తానని చెప్పి.. దేవుళ్ళకు, ప్రజలకు శఠగోపం పెట్టారన్నారు. కొండగట్టులో బస్ ప్రమాదం జరిగితే.. బాధితుల్ని పరామర్శించేందుకు కేసీఆర్ రాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఛార్జ్ షీట్ చేసి.. ఎన్నికల్లో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

Pavitra: మా నాన్న చనిపోయాడని తెలిసి సంతోషించా.. జబర్దస్త్ నటి సంచలన వ్యాఖ్యలు

అంతకుముందు.. తన రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను కేసీఆర్ బలి చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు మహారాష్ట్రకు తోడుకొమ్మని కేసీఆర్ చెప్పడం.. తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుందన్నారు. శ్రీరామ సాగర్‌ను మహారాష్ట్ర చేతికిస్తే.. ప్రాజెక్టు పరివాహక ప్రాంతం స్మశానం అవుతుందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ హక్కుగా ఉన్న ప్రాజెక్టును మహారాష్ట్రకు అప్పగిస్తానంటే, కేసీఆర్‌ను ప్రజలు ఛీ కొడతారంటూ మండిపడ్డారు.