NTV Telugu Site icon

Ponnam Prabhakar: ఫిబ్రవరి 23, 2023న రుణమాఫీ చేస్తానన్నారు చేశారా? హరీష్ రావు కు పొన్నం ప్రశ్న..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: ఫిబ్రవరి 23, 2023 న అప్పటి మంత్రి హరీష్ రావు రుణమాఫీ చేస్తానని సవాల్ చేశారు, రుణమాఫీ చేశారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మనకొండూరు ఎమ్మల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ సీఎం రేవంత్ పై హరీష్ రావు చేస్తున్న సవాల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read also: Adulterated Mutton: కామారెడ్డిలో నాణ్యతలేని మటన్ కలకలం.. కుక్క గాట్లు గుర్తించిన జనం..

ఫిబ్రవరి 23, 2023 న అప్పటి మంత్రి హరీష్ రావు రుణమాఫీ చేస్తానని సవాల్ చేశారు, రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. హరీష్ రావు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని అన్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎప్పుడైనా గ్రామాల్లోకి వచ్చారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మరింత బలం కావాలన్నా, మరింత అభివృద్ధి జరగాలన్న రాష్ట్రంలో 17 కు 17 ఎంపి స్థానాలు గెలిపించాలని కోరారు.

Read also: Harish Rao Vs Revanth Reddy: రాజీనామా పత్రంతో హరీష్ రావు.. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత..

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మార్క్ ఫెడ్ చైర్మన్ గా చేసిన జగపతిరావు కుమారుడు అన్నారు. అవినీతి ఆరోపణలతో బీజేపీ అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ని తొలగించారని అంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లులకు పుట్టిన బిడ్డలు నర్స్ చెప్పేవరకు తెలియదని బండి సంజయ్ అవమాన పరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మూర్ఖుడు మన పార్లమెంట్ సభ్యుడు అయినందుకు సిగ్గు అనిపిస్తుందన్నారు. కోహెడ మండలంతో పాటు, హుస్నాబాద్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
B Vinod Kumar: పార్లమెంటులో జాతీయ రహదారుల కోసం గళ మెత్తింది నేనే..