Ponnam Prabhakar: మాకు గత పదేళ్లలో ఒక్క ఆహ్వాన పత్రిక రాలేదు.. కానీ.. మాజీ ముఖ్యమంత్రిని కూడా మేము ఆహ్వానం పంపామమని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. తెలంగాణకు ఒక గీతం ఉండాలని.. నాడు ఉద్యమానిక.. రాష్ట్ర గీతం ఆవిష్కరిస్తామన్నారు. రాజకీయంగా విమర్శలకు వేదిక కాదు. అన్ని రాజకీయ పార్టీలు వేడుకలు జరుపుకోవాలన్నారు. తెలంగాణ అమరులను ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారన్నారు. తల్లి చనిపోయింది.. బిడ్డను తెచ్చుకున్నారన్నారు. సుష్మాస్వరాజ్ సేవలు మేము మార్చుపోమన్నారు.
Read also: CM Revanth Reddy: రాష్ట్ర దశాబ్ది వేడుకలు.. గవర్నర్ కు సీఎం రేవంత్ ఆహ్యానం
ఆత్మగౌరవం కోసంమే తెలంగాణ ఉద్యమం అన్నారు. మాజీ ముఖ్యమంత్రిని కూడా మేము ఆహ్వానం పంపామన్నారు. మాకు గత పదేళ్లలో ఒక్క ఆహ్వాన పత్రిక రాలేదన్నారు. సోనియా తెలంగాణ ఇచ్చిన ప్రదాత. సోనియా వస్తారనే నమ్మకం ఉందన్నారు. చిహ్నం పై గతంలో ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నిరసన చెప్పు కోవచ్చన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కేసు నమోదు అయ్యిందన్నారు. ప్రభుత్వం కూలి పోతుందని బీజేపీ, బీఆర్ఎస్ పదే పడే శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు.
Read also: Exit Polls: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉండనున్నాయ్..?
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ సమాజాన్ని సంఘటితమ్ చేసే శక్తి జయ జయ హే తెలంగాణ పాట అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది బిడ్డలు ప్రాణాలు అర్పించారన్నారు. గొప్ప తెలంగాణ ఏర్పడాలని అమరవీరులు కోరుకున్నారని తెలిపారు. అమరవీరుల ఆకాంక్షలకు భిన్నంగా పాలన కొనసాగిందన్నారు. ఆత్మగౌరవం కోరుకుంటారు. గత ప్రభుత్వం అందుకు భిన్నంగా గత ప్రభుత్వ పాలన కొనసాగిందని తెలిపారు. సోనియాగాంధీ వస్తారనే ఆశాభావం ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తామన్నారు. దశాబ్ది ఉత్సాహల ముగింపు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనాలన్నారు. ట్యాన్క్ బండ్ మీద వివిధ కళారూపాల ప్రదర్శనలు ఉన్నాయన్నారు. వేడుకల ఏర్పాట్లు బాగున్నాయన్నారు.
Power Cuts: గమనిక.. నేడు హైదరాబాద్ లో పవర్ కట్..
