NTV Telugu Site icon

Ponnam Prabhakar: నేను ఎంపీగా వున్నప్పుడు టాప్ 10లో ఉన్న.. బండి సంజయ్ స్థానం ఏంటి..?

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: ఎంపీగా నేను వున్నప్పుడు టాప్ 10 లో ఉన్న… బండి సంజయ్ స్థానం ఏంటి..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్టీ సూచన మేరకే నిన్న వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారని తెలిపారు. మొదటి దశ ఎన్నికల తర్వాత మోడీ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. మేము అధికారంలోకి వస్త్ర5 కుల గణన చేస్తాం అంటే బీజేపీ కి సంఘ్ పరివార్ కి రుచించడం లేదన్నారు. దేశ ప్రధాని హోదాలో సార్వభౌమత్వాన్ని భంగం చేసేలా మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీ పాలనలో హిందువులకు చేసిన పనులు ఏంటి..? అని ప్రశ్నించారు. హిందువుల్లో భాగమైన బీసీ లకు అన్యాయం చేసింది బీజేపీ… బీసీలు హిందువులు కారా? అని ప్రశ్నించారు. పదేళ్ళలో నరేంద్రమోదీ చేసిన పనుల ఫోటోలు ప్రచారం లేదు.. కానీ రాముడి ఫోటోలు పట్టుకుని ఇల్లిల్లు తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ వస్తే ఇల్లు, బంగారం, సంపద దోచుకుంటారని మోడీ మాట్లాడటం సిగ్గు చేటన్నారు.

Read also: KCR: రేపటి నుంచి మే 10 వరకు కేసీఆర్‌ బస్సుయాత్ర..

రైతులు, నిరుద్యోగులు హిందువులు కాదా…? వాళ్లకు ఎందుకు మోసం చేసావు మోడీ అన్నారు. బండి సంజయ్ ఐపీఎల్ మ్యాచ్ గురించి అంటున్నారు. మా టీమ్ లీడర్ రాహుల్ గాంధీ.. మీ నరేంద్ర మోడీ ఒక్కరే… మాకు ఇండియా కూటమి ఉందన్నారు. నేను ఎంపీగా వున్నప్పుడు టాప్ 10 లో ఉన్న మరి బండి సంజయ్ స్థానం ఏంటి..? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి గురించి నా పుట్టుక గురించి మాట్లాడిన మూర్ఖుడు అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ కి చదువు రాదు.. భాష రాదు… కనీసం ఎదుటి వారిని గౌరవించడం రాదన్నారు. నెత్తిమీద అర్ధరూపాయి పెడితే అర్ధ అణా కి విలువ చేయని వాళ్ళను చేర్చుకుని చేరికలు అంటున్నావు సంజయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అవకతవకలకు పాల్పడితే అధ్యక్ష పదవిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కానీ.. సంజయ్ గీతా కార్మికులకు 50 వేలు.. గుళ్లకు 5 లక్షలు ఇచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Peddapalli: కూలిన మానేరు నదిపై నిర్మాణంలో వున్న వంతెన.. తప్పిన ప్రమాదం..

Show comments