NTV Telugu Site icon

Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకి‌ ఎందుకు లాగుతున్నారు.. బండిసంజయ్‌ పై పొన్నం ఫైర్‌

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకు తల్లిని ఎందుకు లాగుతున్నారు అంటూ బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో మంత్రి పొన్నం మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణకి‌ సంబంధించిన విభజన హామీలు పదేండ్లలలొ నెరవేర్చలేదన్నారు. 29 రాష్ట్రాలకి ఏ విధంగా నిధులు వస్తాయో తెలంగాణ కి‌ అదే విధంగా నిధులు వస్తున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రస్టేషన్ లో ఉన్నాడని తెలిపారు. ప్రభుత్వం కూలుతుందని పిల్లి శాపనార్థలు పెడుతున్నారని అన్నారు. కావాలని బీజేపీ,బీఆర్ఎస్ దుష్ప్రాచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ.వచ్చే పంటకినుగొలు 500 బోనస్ ఇచ్చి తీరుతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించండని కోరారు.

Read also: Netanyahu : నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్న ఐసీసీ

బీజేపీ పదేండ్లలలో చేసిన‌ అభివృద్ధి చూపించి బిజేపి ఓట్లు అడగాలని, రాముని పేరుమీద ఓట్లు ఎందుకు అడుగుతున్నారని తెలిపారు. రాముడు అందరివాడు, అందరూ‌ రాముడిని ఆరాధిస్తారని తెలిపారు. తల్లిని రాజకీయాలకి‌ ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. బండిసంజయ్ ‌అస్కార్‌ అవార్డ్ గ్రహీత అంటూ వ్యంగాస్త్రం వేశారు. గత ఎన్నికలలో వినోద్‌కుమార్ ని ఓడగొట్టడానికి బండిసంజయ్ తో గంగుల కమలాకర్ ఒకటి అయ్యారని తెలిపారు. దేవుడు పేరు మీద ఓట్లు అడిగేవారు ప్రసాద్ స్కీం‌ క్రింద కొండగట్టు, వేములవాడ ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తో టచ్ ఉన్నట్లు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు భూఖబ్జాలకి‌ పాల్పడి జైలుకు‌పోయారన్నారు.
Yarlagadda Venkatrao : మూడు పార్టీల నేతలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలి