నిర్మల్ సభలో.. కేసీఆర్ ఏదేదో మాట్లాడారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇవాళ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్.. తెచ్చిన ధరణితో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రద్దు చేస్తాం అన్నం… చేసి చూపిస్తామని ఆయన వెల్లడించారు. పంట నష్టం జరిగితే… ఇప్పటి వరకు పరిహారం ఏమైందని, ఎకరాకు 10 వేలు ఇస్తా అన్నారు… ఇప్పటి వరకు దిక్కు లేదని ఆయన అన్నారు. సీఎంకి సోయి లేదని, కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా..? అని ఆయన ప్రశ్నించారు. కాలగర్భంలో కేసీఆర్ కలిసి పోతారని, బంగాళాఖాతంలో కలిసి పోయేది కేసీఆర్ అని ఆయన అన్నారు.
Also Read : Mahesh : రాజమౌళి సినిమా కోసం భారీగా ఛార్జ్ చేస్తున్న మహేష్..!!
ఇదిలా ఉంటే.. ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లకు పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. తెలంగాణ సాధించుకుని తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, తెలంగాణను సోనియాగాంధీ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో అది నెరవేరిందా లేదా అని ప్రజలు గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. దశాబ్ధ కాలంలో వందేళ్లు బ్రతికేంత ఆస్తులను సీఎం కేసీఆర్ కుటుంబం సంపాదించుకుందని ఆరోపించారు. తెలంగాణ విభజన సమయంలో రూ.60వేల కోట్లుగా ఉన్న అప్పు ఇప్పుడు రూ.6 లక్షల కోట్లకు చేరిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని, బీఆర్ఎస్ అంటే ట్యాంక్ బండ్లు, రోడ్డు డివైడర్లు, స్ట్రీట్ లైట్లు తప్ప మరేమి లేదన్నారు పొన్నం ప్రభాకర్.
Also Read : Khushi : ఖుషి సినిమా లో నటించబోతున్న మరో స్టార్ హీరోయిన్..!!