Site icon NTV Telugu

Ponnala Lakshmaiah: జనగామ నుంచే పోటీ చేస్తా… జనగామలోనే చస్తా..

Ponnala Lakshmaiah

Ponnala Lakshmaiah

Ponnala Lakshmaiah: జనగామ నుంచే పోటీ చేస్తా…జనగామలోనే చస్తా అంటూ పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేసిఆర్ ఎర్రవెల్లి నుంచి చర్లపల్లి జైల్ కు వెళ్ళక తప్పదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ శేషజీవితాన్ని చర్లపల్లి జైలులో గడుపుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ప్రతిపక్షాలు రాకుండా 144 సెక్షన్ పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు సాగు నీరు అందలేదని మండిపడ్డారు. మంచి చెడుల మధ్య భారత్ జోడో యాత్ర జరిగిందని అన్నారు.

Read also: CM KCR: తెలంగాణను ఎగతాళి చేసిన వారికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ..

చరిత్ర మార్చడానికి జరిగిన జోడో యాత్ర పై ఈనెల 17, 18 హైదరాబాద్ లో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమావేశం అవుతుందని అన్నారు. ప్రచారంతో మోదీ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. 2014లో వంద పబ్లిక్ మీటింగ్ లలో తెలంగాణ తాము తెచ్చామని కేసిఆర్ ఎక్కడైనా చెప్పాడా? అని ప్రశ్నించారు. దేవుల పేర్లు చెప్పి దోచుకున్నాడు కేసిఆర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దోపిడి చేసిన సొమ్ముతో కేసిఆర్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మతాలను ముందుకు తీసుకువచ్చి సెప్టెంబర్ 17ను విమోచన విలీనం అంటూ బీజేపి, బిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Medak: చేతబడి అని అనుమానం.. చెట్టుకు కట్టేసి చితకొట్టిన గ్రామస్తులు

Exit mobile version