ప్రజల క్షేమం విషయంలో అందరికంటే ముందు వరుసలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ముందుగానే సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే గ్రహించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. రైతు మల్లారెడ్డి మనస్థాపానికి ఎందుకు గురయ్యారు. దానికి కెసిఆర్ తీసుకొస్తున్న ఇరీగేషన్ ప్రాజెక్ట్స్ కారణం అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు న్యాయస్థానికి వెళ్లకుండా ప్రొజెక్ట్స్ నిర్మించిన ఘనత కాంగ్రెస్ ది. పోలీస్ లని , రివిన్యూ వ్యవస్థని వాడుకొని గ్రామాలని నుండి ప్రజలకి వెళ్లగొట్టారు. మల్లారెడ్డి చితి పేర్చుకొని సజీవ దహనం చేసుకోవడం చాల బాధకారం. మల్లారెడ్డి చావుకి సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకోవాలి అని పేర్కొన్నారు.