వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు దీనావస్థలో ఉన్నారని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రైతులకు మద్దతు ధర లభించడం లేదని, నాణ్యత ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆయన ఆరోపించారు. 33 శాతం ధాన్యంలో ఇబ్బంది ఉన్నా కొనాలన్న లక్ష్మయ్య.. వడ్లు పోయకున్న మిషన్ లో తేమ శాతం 1.5 చూపిస్తుందని మండిపడ్డారు. ఎండకు కాలే ఇసుకలో కూడా 18 శాతం తేమ చూపిస్తుందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇలా మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమీక్ష చేసేటోడు లేడని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. మోడీ హైదరాబాద్ టూర్‌పై కూడా స్పందించిన లక్ష్మయ్య.. ఐఎస్‌బీకి పునాది వేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. టాప్ 5 ఇన్స్టిట్యూషన్‌లలో ఐఎస్‌బీ ఒకటి అని ఆయన వ్యాఖ్యానించారు.
మోడీ వచ్చి ఏం చెప్తారు.. స్టూడెంట్స్‌కి..రాజకీయాల్లోకి రండి… నాలా ప్రధాని అవ్వండి అని చెప్తారా..? అని అన్నారు. ప్రధాని రావడం నీ స్వాగతిస్తున్నామని, కానీ మోడీ వచ్చిన బ్యాక్ గ్రౌండ్ ఏంటి..!? తెచ్చిన సంస్కరణలు ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. నల్ల చట్టాలకు ఆందోళనలో పంజాబ్ రైతులు చనిపోయారని, నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చింది ఎవరు కేసీఆర్ కాదా..? అని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో రైతుల పరిస్థితి మాత్రం పట్టించుకోలేడు కానీ పంజాబ్ పోయాడు అంటూ విమర్శలు గుప్పించారు.