Site icon NTV Telugu

Puvvada Ajay Kumar: నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవు.. పొంగులేటి పై పువ్వాడ అజయ్ విసుర్లు..

Puvvada Ajay Kumar

Puvvada Ajay Kumar

Puvvada Ajay Kumar: నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ని గద్దె దించాలని కొంతమందిని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని ఆరోపించారు. కొంతమంది నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమ్మేళనల పేరుతో కేసీఆర్ ని తిట్టే చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. గత డిసెంబర్ వరుకు కేసీఆర్ ఎంతగా ఉపయోగించుకున్నారో వాళ్లకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ వ్యక్తిగత పదవులు ఇవ్వలేదని కేసీఆర్ ని విమర్శించడం ఎంత వరుకు కరెక్ట్? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మంచి పనులు చేయడం కేసీఆర్ తప్పా? అందుకేనా కేసీఆర్ ని గద్దె దించాలా చూస్తారా? అంటూ మండిపడ్డారు. కళ్ళు ఉన్న కాబోదులు గోదావరి జలాలుతో కాళ్ళు ఎప్పుడు కడుగుతారు అంటున్నారని అన్నారు.

Read also: Bandi sanjay: 15న రాలేను కానీ.. ఎందుకు హాజరు కావాలో వివరణ ఇవ్వండి..

ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పుడు అశ్వారావుపేట నియోజకవర్గం నుండి వేలేరుపాడు, కుకునూరు మండలాలను బీజేపీ పార్టీ లాక్కుంటే.. అదే పార్టీ వైపు కొంతమంది చూస్తున్నారు అది వారి విజ్ఞత అన్నారు పువ్వాడ. అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అభివృద్ధిలోని శిలా ఫలకం ఒక్కటైన చూపించు? అంటూ సవాల్‌ విసిరారు. మీ ఒక్కరికి కడుపు నొప్పి వస్తే అందరికి వచ్చిందనుకుంటే అది ని పొరపాటే అంటూ పువ్వాడ ఎద్దేవ చేశారు. కేసీఆర్ ని గద్ది దించడం నీ వల్ల కాదు కదా ఎవరి వల్ల కాదంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కరే కాపాడతారు, తెలంగాణా రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని పువ్వాడ అన్నారు. కొంతమంది రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తారకు చేయాలని చూస్తున్నారు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండాలని ప్రజలకు సూచించారు. డబ్బులు పెరిగితే పెరగచ్చు కానీ.. నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకో అంతే గానీ నీ.. పప్పులు కేసీఆర్ ముందు ఉడకవంటూ హెచ్చరించారు.
TSPSC : పేపర్ లీకేజీపై దుమారం.. టీఎస్పీఎస్సీ ఆఫీస్‌ వద్ద హైటెన్షన్

Exit mobile version