NTV Telugu Site icon

Ponguleti: టీడీపీ కృషి మరువ లేనిది.. కాంగ్రెస్ గెలుపు కోసం నిద్ర పోకుండా పని చేశారు..

Pomguleti Srinivas Reddy

Pomguleti Srinivas Reddy

Ponguleti: టీడీపీ కృషి మరువ లేనిదని, కాంగ్రెస్ గెలుపు కోసం నిద్ర పోకుండా పని చేశారని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సీపీఐ, టీడీపీ, ప్రజాపంథా కార్యాలయాలకు వెళ్లి ఆత్మీయ సమావేశాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ నిద్ర పోకుండా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేశారని అన్నారు. అహంకార పూరిత ప్రభుత్వంను ఓడించేందుకు టీడీపీ కృషి మరువ లేనిదన్నారు. జిల్లా రాజకీయాల్లో అహంకారానికి మేము ఎప్పుడు వెళ్ళామన్నారు. మాకు సహకరించిన వారిని ఎప్పుడు మార్చి పోమని తెలిపారు.

Read also: Special Bus for Men: పురుషులకు మాత్రమే.. ఇబ్రహీంపట్నం-ఎల్బీనగర్ రూట్‌లో బస్సు సర్వీసు..!

ప్రజల అవసరం కోసం మేము మీ పోరాటం వుంటుందన్నారు. భవిష్యత్తులో కుడా మీతో మేము వుంటామన్నారు. చిత్తశుద్దితో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ఒకే లోనే మీ పార్టీ మేము పని చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాన్న గద్దె దించడానికి సీపీఐఎంఎల్ ప్రజా పందా సహకరించిందని అన్నారు. నాకు ఎన్నికలలో పాలేరులో మంచి గా సహకరించారని తెలిపారు. వందకు వంద శాతం అభయ హస్తం ద్వారా ఆరు గ్యారెంటీలను అమలు పర్చుతామని తెలిపారు. కాగా.. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేటి పర్యటన రద్ధైన విషయం తెలిసిందే.. మహబూబాబాద్, మరిపెడలో నిర్వహించవలసిన కాంగ్రెస్ పార్టీ సమావేశాలు వాయిదా వేస్తున్నాట్లు నాయకులు ప్రకటించారు. అనంతరం ఖమ్మం జిల్లాలో పర్యటించారు.
Captain Miller : ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్ ‘.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?