Ponguleti Srinivas Reddy: లక్షల మంది అభిమానుల మధ్య నే ఖమ్మం నడి బోడ్డునే పార్టీ లో జాయిన్ అవుతా అని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఖమ్మంలో ఎస్.ఆర్ కాన్ వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నా కోసం వచ్చిన నా కుటుంబ సభ్యుల అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిలా మారుమూల ప్రాంతాల నుండి ఒక్క పిలుపుతో వచ్చారని అన్నారు. పార్టీ మార్పు విషయంపై మీ అందరింతో చర్చించే నిర్ణయం తీసుకుంటా అని గతంలోనే చేప్పానని గుర్తు చేశారు. కురుక్షేత్ర యుద్దం ప్రకటించి 5 నెలల 10 రోజులు అవుతుందని అన్నారు. అధికార పార్టీ నాయకులు మనల్ని ఏగతాళి చేశారు పార్టీ జెండా లేదు ఆజేండా లేదని చవాకులు పెలారని మండిపడ్డారు. వాళ్లు ఎన్ని చేసిన మీ అధికార పార్టీ ట్రాప్ లో శ్రీనన్న కానీ శ్రీనన్న అభిమానులు కానీ పడరని క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా వేరే పార్టీ లో జాయిన్ అవుతున్న అని మీడియాలో రావటాంతో కొందరు అధికార పార్టీ నాయకులు మందు విందు చేసుకొని పండగా చేసుకున్నారు.
ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఆ మందు లేకుండానే కిక్కు ఎక్కీ తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవ చేశారు. రాబోయే కురుక్షేత్రం చిరునవ్వుతూనే రాజకీయ సమాది చేయ్యాటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జయంతి ఉత్సవాలు జరుపుకునే హక్కు మాకు లేదా? అంటూ ప్రశ్నించారు. ఎన్. టి. ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తే మీరు శుద్ది చేస్తారా? రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ది చెబుతారంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టి నా వైపు మళ్ళించే విధంగా మీ ఆధరాభిమానుల వల్లనే సాధ్యం అయ్యిందన్నారు. తండ్రితో సమానం అనుకున్న వ్యక్తే నయా వంచన చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి ఉన్న లేకున్న నేను ప్రజలతోనే ఉంటా అన్నారు. మీరు నడిపించారు కాబట్టి అదే స్పూర్తి ధైర్యంతో ఎంత కొండనైన ఢీ కొడతానంటూ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు నాకు టిక్కెట్ ఇచ్చినట్లైతే ఇంత మంది అభిమానులను కోల్పోయేవాడ్నీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ చర్చలతోమీ అందరి మదిలో ఎమ్ ఉన్నదో అదే జరుగుతుందన్నారు. మూడు నాలుగు రోజుల్లో మీ మదిలో ఉన్నదే మనందరి కొరిక చేప్తానని క్లారిటీ ఇచ్చారు.
వారిని గద్దే దించాలి అంటే వారిని ఇంటికి పంపించాలి అంటే మన లాంటి మైండ్ సెట్ ఉన్న నాయకులతో మనం కలిసి పనిచెయ్యాలని పిలుపు నిచ్చారు. ముఖ్య పార్టీ నాయకులతో ఇప్పటికి చర్చించా ఈ రెండు మూడు రోజుల్లో మీగతా నాయకులతో చర్చిస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో హైదరాబాదు ప్రెస్ మీట్ లో అన్ని వివరాలు వెల్లడిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షల మంది అభిమానుల మధ్య నే ఖమ్మం నడి బోడ్డునే పార్టీ లో జాయిన్ అవుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కొంత మంది సభ పెట్టి జబ్బలు చారిచారు కదా.. అంతకంటే గొప్పగా పెట్టుకొని మనం ఎంటో చూపిద్దామన్నారు. మనం పోయే పార్టీ అధికారంలోకి వచ్చాక కళ్ళబొల్లి మాటాలు చెప్పామ్ ఎమ్ చెప్పాం అదే చేసి చూపేడదామంటూ పొంగిలేటి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి పొంగిలేటి ఏ పార్టీలో చేరుతారో అన్న విషయంపై ఇంకా నాలుగైదు రోజులు ఆగాల్సిందే.
Byju’s Layoff: 1000 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పనున్న బైజూస్