Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. తెలంగాణ ఎలా వచ్చిందని కేసీఆర్ మర్చిపోతున్నారని విమర్శించారు. వేలాది మంది ఆత్మ బలిదానాలు, పోరాటాలను చూసి.. సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని అన్నారు. రాత్రి డ్రింక్ చేసి, పొద్దున్నే వేదిక మీద కూర్చుంటే కాంగ్రెస్ పార్టీ రాలేదన్నారు. ఖమ్మంలో రాహుల్ గాంధీ మీటింగ్‌ను అడ్డుకోవడం కోసం సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చుని ప్లాన్‌లు వేశారని ఆరోపణలు చేశారు. అధికార మదంతో సీఎం కేసీఆర్ మాట్లాడే మాటలన్నింటికీ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
Srinivas Goud: కల్తీ మద్యంపై తొలి పీడీ యాక్ట్.. కఠిన చర్యలు తప్పవంటూ మంత్రి వార్నింగ్
కాంగ్రెస్ అధికారంలో వస్తే, ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో గ్రామాల్లో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పొంగులేటి పిలుపునిచ్చారు. నాలుగు గంటలు పని చేస్తేనే మిషన్ కాకతీయ అంటున్నారని.. అసలు 28 వేల చెరువులు ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. అనేక పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లను సైతం కాంగ్రెస్ పార్టీ కట్టిందన్నారు. 2014కి ముందు, ఆ తరువాత కల్వకుంట్ల ఆర్థిక పరిస్థితి ఏంటో అందరికీ తెలుసన్నారు. లక్షల కోట్లు సంపాదించి ఉండకపోతే.. ప్రధాని పదవికి కేసీఆర్ ఖర్చు పెడతా అంటాడా? అని ప్రశ్నించారు. పరిపాలనపై నమ్మకం ఉంటే, ఇప్పుడున్న 103 మంది ఎమ్మెల్యేలకు బీఫామ్ ఇవ్వాలని తాను విసిరిన సవాల్‌కు ఒక్కరు కూడా నోరు మెదపలేదని గుర్తుచేశారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి కాకుండా గజ్వేల్ నుండే పోటీ చేయాలని సవాల్ విసిరారు.
Rajasthan Gangrape: దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్.. ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి మరీ..
కేసీఆర్‌కు మించిన దొర సత్తుపల్లి ఎమ్మెల్యే అని.. ఆయనకు ఒక ఎజెండా అంటూ లేదని పొంగులేటి విమర్శించారు. బీజేపీలోకి వెళ్తున్నామని ఏటపోతులు కోసి పండగ చేశావని మండిపడ్డారు. ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా, తలక్రిందులు తపస్సు చేసినా.. ఈసారి ఎమ్మెల్యేగా గెలవలేవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో సీట్లు రానివాళ్లు సపోర్ట్ చేస్తారని పగటి కలలు కంటున్నావంటూ కౌంటర్ వేశారు. చిత్తశుద్దితో హస్తం గుర్తుపై ఓట్లు పడేలా తాము కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, సోనియా గాంధీకి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను కాంగ్రెస్ నాయకులతో కలిసి సామాన్య కార్యకర్తగా పని చేస్తానని, కేసీఆర్ ప్రభుత్వం గోతిలో పడేయడమే అందరి లక్ష్యమని పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.