Site icon NTV Telugu

Ponguleti: అప్పులు చేసి భవనాలు కడితే అభివృద్దా..? పొంగులేటి సెటైర్‌

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti: అప్పులు చేసి భవనాలు కడితే అభివృద్దా? అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ ను ఎందుకైతే అధికారం లోకి తెచుకున్నారో 100 కు 100 శాతం అమలు చేస్తున్నామన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే అమలుకు సంతకాలు పెట్టారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాటలతో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నామన్నారు. అప్పులు కోట్లలో ఉన్నా కూడా మాట తప్పకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది.ఆ దిశగా ముందుకు సాగుతామన్నారు. మారుమూల గ్రామ ప్రాంతాల్లోకి కూడా అధికారులు వెళ్ళాలని సూచించారు. తీసుకున్న దరఖాస్తు కు రిషిప్ట్ కూడా ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పును మేం చేయదల్చుకోవడం లేదన్నారు. మేం విడుదల చేసిన శ్వేత పత్రానికి వ్యతిరేకంగా స్వేద పత్రాలు విడుదల చేసారన్నారు. కరెంట్ విశయంలో నిలదీసిన వెంటనే లాక్ బుక్ లు మాయం చేశారని తెలిపారు. అమెరికాలో మా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వక్రీకరించి ఎన్నికల ప్రచారంలో వాడారని మండిపడ్డారు.

Read also: CPI Narayana: దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎలా ఇచ్చారు..?

ధరణి లో తప్పులున్నాయి అంటే కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో వేయమన్నారని గుర్తు చేశారు. ప్రజలు ఎవరిని బంగాళాఖాతంలో వేశారో చూశాంగా అంటూ కమెంట్ చేశారు. అప్పులు చేసి భవనాలు కడితే అభివృధా అన్నారు. 100 రోజుల్లో హామీలన్నీ నెరవేర్చే ఉద్దేశ్యంతోనే ఈ సమీక్షలు అన్నారు. జనాలు వాళ్ళ మాయ మాటలు నమ్మలేదన్నారు. మీ లాగా అధికార దుర్వినియోగం చేయమన్నారు. ప్రజల కోసం సేవకులుగా పనిచేస్తామన్నారు. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజా గుమ్మానికి సంక్షేమ పథకాలను పంపిస్తామన్నారు. మీ మంత్రులు ఏనాడన్న సమీక్ష చేశారా? అసలు మంత్రులకు స్వేచ్ఛ ఉందా? అని ప్రశ్నించారు. మీరు ఎలాగూ చేయలేదు….మమ్మల్ని చేయనియండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు తిన్నదంతా ఎలా కక్కించాలో మాకు తెలుసన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం,మీ ప్రభుత్వం అన్నారు. ఒక్క అప్లికేషన్ కూడా మిస్ కానివ్వం అని మాట ఇచ్చారు. గత ప్రభుత్వాలు వెబ్ సైట్ లో కేవలం రెండు రోజులు మాత్రమే ఉండేదన్నారు. మా ప్రభుత్వం అలా కాదు….చివరి అప్లికేషన్ కూడా తీసుకుంటామన్నారు. పాలనా ఎలా ఉండాలో చూపిస్తామని తెలిపారు.
Lalan Singh : జేడీయూ జాతీయ అధ్యక్ష పదవికి లాలన్ సింగ్ రాజీనామా

Exit mobile version