Site icon NTV Telugu

Lokshabha Elections 2024: రేపే పోలింగ్‌.. తెలంగాణలో 144 సెక్షన్..

144

144

Lokshabha Elections 2024: రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సోమవారం (మే 13) ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. మౌనదీక్ష కారణంగా ఆయా నియోజకవర్గాల నుంచి స్థానికేతరులను బయటకు పంపే ప్రక్రియ మొదలైంది. స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అతిథి గృహాలు, రిసార్టులు, సంక్షేమ కేంద్రాలు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, లాడ్జీలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని అన్నారు. 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల 4 గంటలకు, మూడు చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్సు పిరియడ్ మొదలు అవుతుందని తెలిపారు. ఇవాళ సాయంత్రం ఈవీఏంలు తీసుకుని పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్తారని పేర్కొన్నారు.

Read also: ‘ఛలో ఏపీ’ అంటూ.. రాజకీయ నాయకుల తలరాతలు మార్చడానికి సిద్దమైన బెంగళూరు ఆంధ్ర ఓటర్లు..

పోలింగ్నకు 90 నిముషాల ముందు మాక్ పోల్ నిర్వహిస్తామని ముఖేష్ కుమార్ చెప్పారు. 13వ తేదీన సరిగ్గా 7 గంటలకు పోలింగ్ మొదలు అవుతుందని తెలిపారు. ఇప్పటికే.. పోలింగ్ ఏజెంటుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చామన్నారు. నియోజకవర్గంలో స్థానికుడైన వ్యక్తి అభ్యర్థి నుంచి ధ్రువపత్రాల తీసుకుంటే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్గా అనుమతి ఇవ్వొచ్చని తెలిపారు. అలాగే పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలు ఎలాంటి చిహ్నాలు లేకుండా స్లిప్పులు పంచుకోవచ్చని అన్నారు. పోలింగ్ రోజు ప్రజల రవాణాను నిరోధించాలని ఎన్నికల సంఘం ఉద్దేశ్యం కాదన్నారు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఓటర్లను రాజకీయ పార్టీలు తరలించడం చట్ట వ్యతిరేకం అని తెలిపారు.

Read also: Anil Ravipudi : వెంకీ మూవీ కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకున్న అనిల్ రావిపూడి..?

అభ్యర్థికి సంబంధించి వాహనాల పరిమితి ఉంది.. మూడు వాహనాల వరకే సదరు అభ్యర్థి వినియోగించుకోవచ్చని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రిసైడింగ్ అధికారి మినహా ఎవరూ ఫోన్లు తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ఓటర్లు కూడా ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదని తెలిపారు. అలాగే ఆయుధాలతో ఎవరూ పోలింగ్ కేంద్రాల్లోకి అననుమతించమని పేర్కొన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ గన్ మెన్లతో పోలింగ్ కేంద్రాల్లోకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం 1,06,145 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఈసారి 8,600 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి, నిశ్శబ్ద సమయంలో రాజకీయ పార్టీల కార్యకలాపాలపై నిఘా తీవ్రతరం చేసింది.
BJP vs Congress: బీజేపీ రూ. 100 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది: కాంగ్రెస్ ఆరోపణ

Exit mobile version