Site icon NTV Telugu

TPCC: మళ్లీ హీట్‌.. రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ఎటాక్‌ స్టార్ట్..!

తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. ఇదే సమయంలో.. ఆయను టార్గెట్‌ చేసే బ్యాచ్‌ కూడా పెద్దదే.. క్రమంగా అందరితో కలిసిపోయే ప్రయత్నాలు జరుగుతున్నా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై డైలాగ్స్‌ పేల్చడంలో… జగ్గారెడ్డి ముందు వరుసలో ఉన్నారు.. పార్టీ వ్యక్తిగత ఇమేజ్ కోసం రేవంత్ పని చేస్తున్నారంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. సీనియర్స్ సమావేశం తర్వాత… ఏకంగా రేవంత్‌కే సవాల్ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. దమ్ముంటే పోటీకి అభ్యర్థిని నిలబెట్టి.. గెలవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: Ukraine Russia War: భారత్‌పై బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

జగ్గారెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ సీరియస్ అయ్యారు. అధిష్టానం దృష్టికి సీనియర్స్ సమావేశాన్ని తీసుకెళ్లారు. అటు వీహెచ్‌, జగ్గారెడ్డి ఎపిసోడ్ పై నివేదించారు. క్రమశిక్షణ రాహిత్యంపై సహించేది లేదనే ఇండికేషన్ పంపాలని నిర్ణయించారు. సైలెంట్‌గా ఉంటే.. ఇదే కంటిన్యూ అవుతుందనే ఆలోచనకు వచ్చారు రేవంత్‌రెడ్డి. జగ్గారెడ్డికి ఉన్న బాధ్యతల్లో కోత పెట్టారు. ఆయనకు అప్పగించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతలను… అంజన్, అజారుద్దీన్, మహేష్ గౌడ్‌కు అప్పగించారు. ఇక, జగ్గారెడ్డి బాధ్యతలకు కోత పెట్టిన రేవంత్… ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఢిల్లీకి వెళ్లినట్టు ప్రచారం నడస్తోంది. అయితే, పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్‌తో భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం జగ్గారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గానే ప్రెస్ మీట్ పెట్టాలని డిసైడ్ అయినట్టు సమాచారం. మొత్తంగా.. సైలెంట్‌ అయ్యిందనుకున్న జగ్గారెడ్డి ఇష్యూ.. మరోసారి పార్టీలో కాకరేపుతోంది.

Exit mobile version