NTV Telugu Site icon

TG Polycet Results: నేడు పాలిసెట్ ఫ‌లితాల విడుద‌ల‌..

Tg Polises

Tg Polises

TG Polycet Results: పాలీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఐఏఎస్‌, తెలంగాణ ఎస్‌బీటీఈటీ ఛైర్మన్‌ శ్రీ బి. వెంక‌టేషం, ఎస్‌బీటీఈటీ ఎస్‌.వీ భ‌వ‌న్‌, మాస‌బ్ ట్యాంక్‌, హైద‌రాబాద్‌లో పాలిసెట్ 2024 ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఫలితాల కోసం https://sbtet.tela ngana.gov.in ని సంప్రదించవచ్చు. కాగా.. మే 24న పాలిసెట్ రాత ప‌రీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 49 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడ పట్టణాల్లో సైతం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Read more: Road Accident: పెళ్లిబృందం ట్రాక్టర్‌ బోల్తా.. 13 మంది మృతి!

మొత్తం 31,725 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 27495 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 4232 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మూడు విడతలుగా జరగ్గా.. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన పరీక్షలో 85% మంది , రెండో విడత 12:30 నుండి 2:30 వరకు జరగగా 86%, మూడవ విడత నాలుగు గంటల నుండి 6 గంటల వరకు 88% మంది హాజరయ్యారు. ప్రశ్నాపత్రాల కోడ్ విడుదల అనంతరం పరిశీలనకు వెళ్లిన ఆచార్య లింబాద్రి.. ఆన్లైన్ పరీక్ష విధానాన్ని వివరించారు.

Read more: Astrology: జూన్ 03, సోమవారం దినఫలాలు

తెలంగాణ పాలిసెట్ – 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 20 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించగా.. జూన్ 22 నుంచి మొదటి దశ వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. జూన్ 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో దశ కౌన్సెలింగ్‌ జూలై 7 నుంచి ప్రారంభం కానుంది. జూలై 13న సీట్లు కేటాయిస్తారు. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన గైడ్ లైన్లను జూలై 23న విడుదల చేస్తారు. జూలై 24లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
ladies Missing In Beach: బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు..