NTV Telugu Site icon

Hyderabad: పెళ్లి బరాత్‌ను అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం, తోపులాట..

Hyderabad Marrrige Barath

Hyderabad Marrrige Barath

Hyderabad: హైదరాబాద్‌లో పోలీసుల విస్తృత సోదాలు నిర్వహించారు. ఓల్డ్ సిటీలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో అర్ధరాత్రి అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. జరుగుతున హత్యల కారణంగా పోలీసులు అలర్ట్‌ అయ్యారు. రాత్రి, పగలు అని తెలియకుండా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. అయితే.. పోలీసులు తనిఖీల్లో భాగంగా.. పెళ్లి బరాత్‌ లో అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఆసిఫ్‌నగర్‌ పరిధిలో ఓ పెళ్లి బరాత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అర్థరాత్రి బరాత్‌ లను అనుమతిలేదంటూ అడ్డుకున్నారు. అర్ధరాత్రి బాణసంచా కాలుస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేయడంతో బరాత్‌ ఎందుకు అనుమతి లేదంటూ వాదించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే దీనిపై ఆగ్రహంతో పోలీసుల వారిపై లాఠీలతో వెల్లగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు పెద్దలు పోలీసులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

Read also: Israel: ఇజ్రాయెల్ కు ఆయుధ సరఫరా నిలిపేసిన అమెరికా..కారణం ఏంటంటే?

అయినా వినకుండా గుర్రంపై వస్తున్న పెళ్లికొడుకు బరాత్‌ ను అడ్డుకుని ఫంక్షన్ హాల్లో సంబరాలు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. బరాత్‌ లో పటాకులు ఎందుకు కాలుస్తున్నారంటూ అడ్డుకుని వారిని భూతు పురాణం మొదలుపెట్టాడారు. అడ్డుకున్న పోలీసులతో బారాత్‌ వారు వాగ్వాదం మొదలు పెట్టారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. అయితే బరాత్‌ పెద్దలు మాట్లాడుతూ ఎప్పుడూ లేని కొత్తరూల్స్ ఏంటని మండిపడ్డారు. అలా ఏమైనా ఉంటే ముందే చెప్పాలని అన్నారు. బారాత్ అన్నాక అందరూ సంబరాలు చేసుకుంటారని తెలిపారు. అయినా రాత్రి కూడా టపాసులు, బారాత్ చేస్తే ఎప్పుడు అడ్డుకోని పోలీసులు ఇప్పుడు పెళ్లికొడుకు బారాత్ అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దుకుని పోవడంతో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. రోడ్డుకు అడ్డుగా కాకుండా బరాత్‌ ను ఒక సైడునుంచి తెస్తున్నా పోలీసులు అత్యుత్సాహం చూపించారని మండిపడ్డారు. పోలీసులంటూ మాకు గౌరవమని.. మునుపెన్నడూ లేని విధంగా ఇలాంటి అనుమతులు లేవని చెప్పడం విడ్డూరంగా వుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనందంగా బరాత్ చేస్తున్న సమయంలో ఇలా చేయడం సమంజసం కాదని తెలిపారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందించనున్నారో వేచి చూడాలి.
Hyderabad: మద్యం తాగి బస్సు నడిపిన మార్నింగ్ స్టార్ బస్సు డ్రైవర్(వీడియో)