Site icon NTV Telugu

Police SI Exams Prelims: నేడు ఎస్సై ప్రిలిమ్స్‌ పరీక్ష.. హాల్‌ టికెట్‌ పై అదివుండాల్సిందే..

Police Si Exams Prelims

Police Si Exams Prelims

Police SI Exams Prelims: నేడు ఎస్సై ప్రిలిమ్స్‌ పరీక్ష మొదలు కానుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై పోస్టుల భర్తీకి నేడు (ఆదివారం) ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనుంది. దీనికి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి , పోలీస్‌శాఖ సాంకేతికంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. ఇవాళ ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు హైదరాబాద్‌, మొదలగు ప్రాంతాలతో కలిపి మొత్తం 503 పరీక్ష కేంద్రాలు, వీటికి అదనంగా 35 పట్టణాల్లోనూ పరీక్ష జరుగనుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి మాత్రమే కేంద్రంలో అడుగుపెట్టాలని, బయోమోట్రిక్‌ విధానంలో హాజరు తీసుకుని, మొత్తం పరిసరాలు సీసీటీవి కెమెరాలతో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు అధికారులు, ఆయా జిల్లాల పరిధిలో ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు స్వయంగా పరీక్ష ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

read laso: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

హాల్‌ టికెట్‌ పై అభ్యర్థి పోటోలేదంటే అనుమతి ఉండదు.
హాల్‌ టికెట్‌ పై తప్పకుండా పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటో వుండాలని తెలిపారు.
లేదంటే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు
ఆఫోటో ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసిన సమయంలో అప్‌లోడ్‌ చేసినదై మాత్రమే వుండాలని పేర్కొన్నారు.

అయితే పరీక్షలో 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు 200 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి 0.20 మార్క్‌ కట్‌ అవుతాయని పేర్కొంది. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్క్‌ తప్పనిసరి అని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి హాల్‌టికెట్‌తోపాటు బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్నులను అనుమతిస్తారు. పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్‌ విధానంవుంటుంది, అభ్యర్థులు చేతులకు మెహందీ, టెంపరరీ టాటూలు పెట్టుకోకూడదు. అభ్యర్థుల వద్ద మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌ డివైజ్‌లు, రిస్ట్‌వాచ్‌లు, వాచ్‌ కాల్యుకులేటర్లు, వ్యాలెట్‌, విడి కాగితాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేసారు.
Delhi: పోలీస్‌ స్టేషన్‌లోనే కానిస్టేబుల్‌పై రౌడీ మూక దాడి.. వీడియో వైరల్

Exit mobile version