Stephen raveendra: గోవాలో 7 వేలకు కొని… హైదరాబాద్ లో 18 వేలకు అమ్ముతున్నారు.. సీపీ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stephen raveendra: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. ప్రధాన నిందితుడు నైజీరియన్ తో పాటు ఐదుగురిని సైబరాబాద్ SOT పోలీసులు అదుపులో తీసుకున్నారు. నైజీరియన్ కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ అదుపులో వున్నాడని పోలీసులు తెలిపారు. వారి వద్దనుంచి కోట్ల రూపాయల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. విదేశాల నుండి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్న ముఠాగా పోలీసులు గుర్తించారు.
Read also: Telangana Police: కచ్చితంగా ఉండాల్సిందే.. బైక్ కొనేవారికి పోలీసులు కొత్తరూల్స్
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడిందని తెలిపారు. నలుగురిని సైబరాబాద్ SOT పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరొక నైజీరియన్ పరారీలో ఉన్నాడని తెలిపారు. A2 నైజీరియాకి చెందిన గాబ్రియల్.. నైజీరియాకి వెళ్ళిపోయాడని తెలిపారు. ఈ ముఠాకి కింగ్ పిన్ చింతా రాకేష్ అని, గోవా నుంచి కొకైన్ తెచ్చి హైదరాబాద్ లో సప్లై చేస్తున్నాడని తెలిపారు. డ్రై ఫ్రూట్ బిజినెస్ లో లాస్ రావడంతో.. డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని అన్నారు. గోవాలో 7 వేలకు గ్రామ్ కొని, హైదరాబాద్ లో 18 వేలకు అమ్ముతున్నాడని వెల్లడించారు. ఒక కోటి 33 లక్షల విలువైన 303 గ్రామ్స్ కొకైన్, రెండు కార్లు, 5 సెల్ ఫోన్స్ సీజ్ చేశామని తెలిపారు. A4 సూర్య ప్రకాష్ ని పట్టుకోవడంతో ఈ ముఠా గురించి బయటపడిందని స్పష్టం చేశారు. కస్టమర్స్ ఎవరో గుర్తించే పనిలో ఉన్నామని, వారికి నోటీసులు ఇస్తామన్నారు. NDPS యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం కష్టమర్స్ కి నోటీసులు ఇస్తామన్నారు. వాట్సాప్ ద్వారా కస్టమర్లను ఈ ముఠా సంప్రదిస్తుందని తెలిపారు. హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలు హోస్ట్ చేసి… కంజ్యుమర్స్ ని పిలిచి అక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నారని అన్నారు. నిందితుల వాట్సాప్ చాట్ లో కొంతమంది ప్రముఖ వ్యారవేత్తలు కూడా ఉన్నారని అది తెలిసి పోలీసులు షాక్ తిన్నారని తెలిపారు. కొకైన్ కి మార్కెట్ లో బాగా డిమాండ్ ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడికి సప్లై చేస్తూ కోట్లు సంపాదిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.
Fevikwik Treatment: ఇదొక కొత్త ట్రీట్ మెంట్.. కుట్లకు బదులు చిన్నారికి ఫెవిక్విక్‌తో వైద్యం
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!