NTV Telugu Site icon

రాజు కోసం పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్…

కిరాతకుడు రాజు కోసం పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. తెలంగాణ మొత్తంగా పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుంది. నల్గొండ జిల్లా పంతంగి వద్ద రాజు దొరికాడంటూ సిసి టివి ఫుటేజ్ లో దృశ్యాలు చూసి వెతుకుతున్నారు. వాడు- వీడు ఒక్కటేనంటూ సోషల్ మీడియా ప్రచారం చేసింది. పంతంగి టోల్ గేట్ సమీపంలో రాజు మాదిరిగా ఉన్న వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చౌటుప్పల్, పంతంగి పరిసర ప్రాంతాలు రాజు తిరుగుతున్నాడను విస్తృతంగా ప్రచారం జరిగింది. రాజు ఆనవాళ్లు తో పాటు అలాంటి బ్యాగ్ తో తిరుగుతున్నాడని సమాచారం. రాజు కోసం విస్తృతంగా గాలిస్తున్నామని అంటున్న పోలీసులు… రాజు ఇప్పటి వరకు తమకు దొరకలేదని చెప్తున్నారు. 1000 మంది పోలీసులతో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు పోలీసులు.