Club Masti: పబ్బుల్లో ఆగని అశ్లీల నృత్యాలు.. క్లబ్ మస్తీ పబ్ పై పోలీసుల దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజుల నుంచి పోలీసులు పబ్ లపై దాడులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో పబ్ లలో ఆశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని పబ్ లను సీజ్ చేస్తూ పలువురులను అదుపులో తీసుకుంటున్న పబ్ ల భాగోవతం ఏ మాత్రం ఆగడం లేదు. పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. పబ్ లలో ఆశ్లీల నృత్యాలు, సమయానికి మించి పబ్ లు నడపడం వంటివి జరుగుతునే వున్నాయి. పబ్‌కు కష్టమర్లను ఆకట్టుకునేందుకు పబ్బుల్లో అశ్లీల నృత్యాలతో గబ్బు రేపుతున్నారు. కొద్దిరోజులుగా పోలీసులు పబ్ ల ఫోకస్ చేయడంతో.. ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. మొన్న టకీరా, నిన్న బసేరా, నేడు క్లబ్ మస్తీపబ్ లపై దాడులు జరుగుతున్నా పబ్ ల భాగోతం మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. వరుసగా పబ్ ల పై దాడులు చేస్తూ వారిని అదుపులో తీసుకుంటున్నా నిమ్మకు నీరెత్తకుండా వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు పబ్ యజమానులు.
నిన్న రాత్రి కెపిహెచ్ బి మంజీరా మెజెస్టిక్ కమర్షియల్ లోని క్లబ్ మస్తీ పబ్ పై మదాపూర్ ఎస్ ఓ టీ పోలీసుల దాడులు చేశారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. పరిమితికు మించి డిజె సౌండ్ తో పబ్ నడుపుతున్న క్లబ్ మస్తీ పై దాడులు జరిపామన్నారు. యువతులతో అర్థనగ్నంగా నృత్యాలు చేస్తున్నారని అన్నారు. పబ్ యాజమాన్యం కస్టమర్లను ఆకట్టుకునే విధంగా పబ్ లో యువతులను ఏర్పాటు చేసారని తెలిపారు. 9 మంది డ్యాన్సర్లు యువతులు, మేనేజర్ ప్రదీప్ కుమార్, డేజె ఆపరేటర్ దనరాజగ్, కస్టమర్ సాయి సంతోష్ లను అరెస్ట్ చేసామని తెలిపారు. డిజే మిక్సర్, హుక్కా ప్లేవర్లు స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. నిందితులను కేపీహెచ్ బీ పోలీసులకు అప్పగించామని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అన్నారు. ఇక పరారీలో వున్న క్లబ్ మస్తీ పబ్ ఓనర్ శివ ప్రసాద్ రెడ్డి, మేనేజర్లు విష్ణు, కృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
chiranjeevi : 35 ఏళ్ళ చిరంజీవి ‘చక్రవర్తి’!
- Tags
- Club Masti Pub
- kphb
- madhapur
- police
- raid
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!