Site icon NTV Telugu

Club Masti: ప‌బ్బుల్లో ఆగ‌ని అశ్లీల నృత్యాలు.. క్ల‌బ్ మస్తీ ప‌బ్ పై పోలీసుల దాడులు

Pub

Pub

గ‌త కొద్ది రోజుల నుంచి పోలీసులు ప‌బ్ ల‌పై దాడులు నిర్వ‌హిస్తున్నారు. రాత్రి స‌మ‌యంలో ప‌బ్ ల‌లో ఆశ్లీల నృత్యాలు జ‌రుగుతున్నాయ‌ని ప‌బ్ ల‌ను సీజ్ చేస్తూ ప‌లువురుల‌ను అదుపులో తీసుకుంటున్న ప‌బ్ ల భాగోవ‌తం ఏ మాత్రం ఆగడం లేదు. ప‌ట్టించుకోకుండా వారి ప‌ని వారు చేసుకుంటూ పోతున్నారు. ప‌బ్ లలో ఆశ్లీల నృత్యాలు, స‌మ‌యానికి మించి ప‌బ్ లు న‌డ‌ప‌డం వంటివి జ‌రుగుతునే వున్నాయి. ప‌బ్‌కు క‌ష్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప‌బ్బుల్లో అశ్లీల నృత్యాలతో గబ్బు రేపుతున్నారు. కొద్దిరోజులుగా పోలీసులు ప‌బ్ ల ఫోక‌స్ చేయ‌డంతో.. ఒక్కొక్కటిగా బ‌య‌ట ప‌డుతున్నాయి. మొన్న ట‌కీరా, నిన్న‌ బ‌సేరా, నేడు క్ల‌బ్ మస్తీప‌బ్ ల‌పై దాడులు జ‌రుగుతున్నా ప‌బ్ ల భాగోతం మాత్రం ఓ కొలిక్కి రావ‌డం లేదు. వ‌రుస‌గా ప‌బ్ ల పై దాడులు చేస్తూ వారిని అదుపులో తీసుకుంటున్నా నిమ్మ‌కు నీరెత్త‌కుండా వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు పబ్ యజమానులు.

నిన్న రాత్రి కెపిహెచ్ బి మంజీరా మెజెస్టిక్ క‌మ‌ర్షియ‌ల్ లోని క్ల‌బ్ మ‌స్తీ ప‌బ్ పై మ‌దాపూర్ ఎస్ ఓ టీ పోలీసుల దాడులు చేశారు. అనంత‌రం పోలీసులు మాట్లాడుతూ.. పరిమితికు మించి డిజె సౌండ్ తో పబ్ నడుపుతున్న క్లబ్ మస్తీ పై దాడులు జ‌రిపామ‌న్నారు. యువతులతో అర్థనగ్నంగా నృత్యాలు చేస్తున్నార‌ని అన్నారు. పబ్ యాజ‌మాన్యం కస్టమర్లను ఆకట్టుకునే విధంగా పబ్ లో యువతులను ఏర్పాటు చేసార‌ని తెలిపారు. 9 మంది డ్యాన్స‌ర్లు యువతులు, మేనేజర్ ప్రదీప్ కుమార్, డేజె ఆపరేటర్ దనరాజగ్, కస్టమర్ సాయి సంతోష్ ల‌ను అరెస్ట్ చేసామ‌ని తెలిపారు. డిజే మిక్సర్, హుక్కా ప్లేవర్లు స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. నిందితులను కేపీహెచ్ బీ పోలీసులకు అప్పగించామ‌ని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అన్నారు. ఇక పరారీలో వున్న క్లబ్ మస్తీ పబ్ ఓనర్ శివ ప్రసాద్ రెడ్డి, మేనేజర్లు విష్ణు, కృష్ణ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని పోలీసులు తెలిపారు.

chiranjeevi : 35 ఏళ్ళ చిరంజీవి ‘చక్రవర్తి’!

Exit mobile version