జూబ్లిహిల్స్ ఆమ్నేసియా పబ్ అత్యాచార కేసులో ఐదుగురు నిందితులను గుర్తించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. ఇందులో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఈ కేసులో నిందితులుగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. భరోసా సెంటర్ కు పంపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత బాధిత అమ్మాయి పూర్తి వివరాలను చెప్పిందని ఆయన వెల్లడించారు.
నిందితులపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని డీసీపీ వెల్లడించారు. అమ్మాయి ఒక్కరి పేరును మాత్రమే వెల్లడించిందని..మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు వెల్లడించిందని చెప్పారు. 48 గంటల్లో ఒక నిందితుడు సాదుద్దీన్ అలీం ను అరెస్ట్ చేశామని వెల్లడించారు. టాస్క్ ఫోర్స్, సీసీఎస్, సైబర్ క్రైమ్ తో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం జోయల్ డేవిస్ వెల్లడించారు. జువైనల్ నిందితులను ప్రస్తుతం కుటుంబ కస్టడీలో ఉంచామని వెల్లడించారు.
సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం జువైనల్ నిందితులను వివరాలను వెల్లడించలేమని తెలిపారు. నిందుతులపై పోక్సో, నిర్భయ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టామని.. ఏసీపీ స్థాయి అధికారి విచారిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో హోంమంత్రి మనవడు, ఎమ్మెల్యే కుమారుడు లేడని జోయల్ డేవిస్ వెల్లడించారు. అయితే పేరొందిన నాయకుడి కుమారుడు ఉన్నాడని ఆయన అన్నారు. అయితే ఇప్పటి వరకు అత్యాచార ఘటనన వీడియోలో రికార్డ్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు. బాధితురాలు మమూలు స్థితికి వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలుసుకుంటాం అని డీసీపీ అన్నారు.