Site icon NTV Telugu

Police License: హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తున్నారా..? ఇక, ఈ లైసెన్స్‌ ఉండాల్సిందే..

Police License

Police License

Police License: హైదరాబాద్‌లో వ్యాపారులకు పోలీస్ లైసెన్స్‌ కూడా తప్పనిసరి చేశారు.. వ్యాపారం చేయాలంటే.. ట్రేడ్ లైసెన్సు, ఫుడ్ లైసెన్స్‌, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీతో పాటు ఇప్పుడు పోలీసు లైసెన్స్‌ కూడా కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.. 2014 తర్వాత ఈ లైసెన్స్‌ విధానాన్ని రద్దు చేశారు సిటీ పోలీసులు.. అయితే, ఇప్పుడు మళ్లీ ఆ నిబంధన తీసుకొచ్చారు.. తొమ్మిదేళ్ల తర్వాత పోలీసు లైసెన్స్‌ నిబంధన అమలు చేస్తున్నారు.. స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌, పట్లు, కాఫీ షాప్, టీ స్టాల్, కేఫ్‌, బేకరీ, రెస్టారెంట్, ఐస్ క్రీమ్ పార్లర్, స్వీట్ షాప్, జ్యూస్ సెంటర్, సినిమా థియేటర్స్‌, ఫైర్ క్రాకర్స్, పెట్రోలియం ఉత్ప త్తులు.. ఇలా అన్ని రకాల వ్యాపారాలకు పోలీసు లైసెన్స్‌ తీసుకోవాల్సిందే అన్నమాట..

Read Also: Team India: జట్టులో అతడు మెజిషీయన్ లాంటోడు.. రోహిత్ శర్మ ప్రశంసలు

అసలు ఎవరు ఈ లైసెన్స్‌ తీసుకోవాలి..? ఎలా తీసుకోవాలనే విషయంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు.. స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌, పట్లు, కాఫీ షాప్, టీ స్టాల్, కెఫే, బేకరీ, రెస్టారెంట్, ఐస్ క్రీమ్, పార్లర్, స్వీట్ షాప్, జ్యూస్ సెంటర్, సినిమా థియేటర్స్, ఎక్స్‌ఫ్లోజివ్, ఫైర్ క్రాకర్స్, పెట్రోలియం ఉత్పత్తులు విక్రయించేవారు తప్పనిసరిగా లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది.. ఇక, లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్‌ను పొందాలనుకునే వ్యాపారులు hyderabadpolice.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. తమ వ్యాపార స్థాయిని బట్టి రూ.1000 నుంచి రూ.15000 వరకూ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే.. జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్‌, అద్దె, ఇతర ఒప్పంద పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఏటా ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 తేదీ వరకు గడువుతో ఈ లైసెన్స్‌లు జారీ చేస్తారన్నమాట.. కాగా, వరుస ప్రమాదాలతో అప్రమత్తమైన అధికారులు.. ఇకపై పోలీసు లెసెన్స్ విధానాన్ని మరోసారి అమల్లోకి తెచ్చినట్టు తెలుస్తోంది.. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ఆపేసిన లైసెన్స్ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఇకపై ఎలాంటి వ్యాపారం చేయాలన్నా పోలీస్, ఫైర్‌, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు పోలీసు లైసెన్స్‌ కూడావా తప్పనిసరి అన్నమాట..

Exit mobile version