Naveen Case: నవీన్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. A2 నిందితురాలిగా ప్రియురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Included Niharika Reddy As A2 Hasan As A3 In Naveen Case: అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో ప్రియురాలు నిహారిక రెడ్డిని పోలీసులు నిందితురాలిగా చేర్చారు. ప్రియురాలి కోసమే నవీన్‌ను హత్య చేసిన హరిహర కృష్ణ.. హత్య చేసిన తర్వాత నిహారికకు వాట్సాప్‌లో ఫోటోలు పంపాడు. అంతేకాదు.. అదే రోజు రాత్రి సంఘటనా స్థలానికి నిహారికను తీసుకువెళ్లి, నవీన్ మృతదేహాన్ని హరిహర కృష్ణ చూపించాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. నిహారికతో పాటు మిత్రుడు హసన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లాడు. నవీన్ మృతదేహాన్ని చూసిన అనంతరం.. హరిహర కృష్ణకు నిహారిక రెడ్డి కొంత మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసింది. అక్కడ కాసేపు ఉన్న ఈ ముగ్గురు.. తిరిగి తమతమ ఇళ్లకు వెళ్లిపోయినట్టు తెలిసింది. విస్తుగొలిపే ఈ విషయాలన్ని విచారణలో తేలడంతో.. A2గా నిహారికను, A3గా హసన్‌ను పోలీసులు చేర్చారు.
Bike Burst: దారుణం.. పెట్రోల్ బంక్‌లో బైక్ పేలి, ఒకరు సజీవదహనం
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
కాగా.. నవీన్, హరిహర కృష్ణ, నిహారిక రెడ్డి ఇంటర్మీడియట్లో కలిసి చదువుకున్నారు. తొలుత కృష్ణ, నిహారిక ప్రేమించుకున్నారు. అయితే.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరమయ్యారు. అనంతరం నవీన్‌కి నిహారిక దగ్గరైంది. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ విషయం తెలిసి మండిపోయిన హరిహర కృష్ణ.. తన ప్రియురాలు దూరమవుతుందన్న భయంతో నవీన్‌ని హతమార్చేందుకు స్కెచ్ వేశాడు. ఫిబ్రవరి 17వ తేదీన తన ఇంటికి వచ్చినప్పుడు.. హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. నవీన్‌కు హాస్టల్‌కు డ్రాప్ చేయాలని బైక్ మీద బయల్దేరినప్పుడు.. నిహారిక రెడ్డి విషయమై ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడే హరిహర కృష్ణ తనతోపాటు తెచ్చుకున్న కత్తితో నవీన్‌ని పొడిచి చంపాడు. అనంతరం గుండె, చేతులు, పెదవులు, సీక్రెట్ భాగాలను సైతం కోశాడు. ఈ భాగాల ఫోటోలను నిహారిక రెడ్డికి వాట్సాప్‌లో పంపగా.. ‘గుడ్ బాయ్’ అంటూ నిహారిక రిప్లై ఇచ్చింది. అది చూశాకే పోలీసులు అనుమానం వచ్చి, నిహారిక కోణంలో దర్యాప్తు చేయగా.. పై సంచలన నిజాలు బయటపడ్డాయి.
Crime News: దారుణం.. ఆ పనిచేసిందని.. భార్యను చంపి, ముక్కలు చేసిన భర్త
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!