Site icon NTV Telugu

Police Focus On Mavoists: ఆదిలాబాద్‌ పోలీసుల నయా ప్లాన్‌

ఆకురాలే కాలం అన్నలకు గడ్డుకాలం అంటారు. అలాంటి కాలంలో ఎక్కడా మావోల మొలకలు పడకుండా పోలీసులు ముందు జాగ్రత్త పడుతున్నారు. మాజీలను అలెర్ట్ చేయడంతోపాటు యూజీలను జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు యువత అటు వైపు వెళ్ళకుండా దారి మళ్ళించే పనిలో పడ్డారు ఖాకీలు. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల ప్లాన్ ఏంటి? మారుమూల, మావోయిస్టు గ్రామాలపై ఫోకస్ ఎందుకు పెడుతున్నారు.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల మారుమూల గ్రామాలపై పోలీసులు కన్నేసారు. మరీ ముఖ్యంగా గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు..వేసవి కాలం కాబట్టి అన్నలకు అంత కలిసి రాకుండా ఉండే పరిస్థితులు ఎదురౌతాయి.అయితే ఇదే అదునుగా పోలీసులు అప్రమత్తం అయ్యారు..అడవుల్లో ఉండలేని పరిస్థితులు వేసవిలో ఉంటాయి కాబట్టి ఎక్కడా షెల్టర్ లేదా మావోయిజం వైపు ఎవ్వరు ఆలోచించకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు…అందులో భాగంగానే మావోయిస్టులకు పెట్టని కోటలుగా ఉన్న ప్రాంతాలపై ఓ కన్నేసి ఉంచారు..అంతేకాదు యువత అటువైపు మళ్ళకుండా వారిని ఆకట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఆమధ్యకాలంలో బోథ్ మండలంలోని కొత్తపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించి, యువజన సంఘాలుకు క్రీడాడాపరికరాలు అందించారు జిల్లా ఎస్పీ.

బోథ్ ఏరియాలోని పలు ప్రాంతాల్లో కరోనా కాలంలో పొచ్చరకు చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ ,అండ్ టీం వచ్చిపోయిందని పోలీసులు ప్రకటించారు..అయితే అప్పుడు ఏకంగా అడవులను కూంబింగ్ బలగాలు జల్లెడ పట్టాయి. ఆక్రమంలోనే కడంబాలో ఎన్ కౌంటర్ జరగ్గా ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు..భాస్కర్ అప్పుడు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు..అయితే ఇటీవల జిల్లా ఎస్పీ మారుమూల గ్రామాల్లో పర్యటన సందర్బంగా మావోయిస్టు భాస్కర్ ఎక్కడున్నా లొంగిపోవాలని హితవుపలికారు.

బోథ్ ఏరియాలోని పలు గ్రామాలు అప్పట్లో మావోలకు డెన్ గా ఉండేవి. కానీ ఆతర్వాత పరిస్థితులు అంతా మారిపోయాయి. ఉమ్మడి జిల్లాలోని భాస్కర్ ఆధ్వర్యంలో మావోయిస్టుల టీం వచ్చి వెళ్ళినట్టు చెప్పారు..అయితే ప్రస్తుతం మావోల ఉనికి లేదంటూనే మాజీలతో సమావేశాలు కావడం ,మారుమూల పోలీస్ స్టేషన్ లను కొత్త ఎస్పీ వచ్చాక అప్రమత్తం చేస్తున్నారు..అంతేకాదు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నతవిద్యకు దూరం అవుతున్న యువకులు చెడు మార్గాల ను ఆశ్రయించకుండా మీకోసం మేమున్నామనే దైర్యం కల్పించడం కోసం ఉచిత శిక్షణ,మారు మూల గ్రామాలకు రోడ్లు వేస్తున్నారు పోలీసులు.

గతంలో తిర్యాణి మండలంలో పలు గ్రామాలతోపాటు బోథ్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు ఏకంగా పోలీసులు సొంత ఖర్చులతో రోడ్లు వేయించారు..ఇంకా తుపాకీగొట్టంతో రాజ్యాధికారం సాధించాలని నిర్ణయంతో అడవుల్లో ఉండే మావోలు ఇక చేసేది ఏం లేదని లొంగిపోవాలని పోలీసులు పిలుపునిస్తున్నారు జిల్లా పోలీసు బాస్. ఉమ్మడి జిల్లాకు చెందిన వారు సెంట్రల్ కమిటీలో పనిచేస్తున్న వారితోపాటు రాష్ట్ర కమిటీతోపాటు వివిధ హోదాల్లో పనిచేసే వారు మావోయిస్టు పార్టీలో ఉన్నారు..అయితే వారంతా ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అందరూ లొంగిపోవాలని సూచిస్తుండంతోపాటు ఒకవేళ ఎవ్వరైనా జిల్లాకు వస్తే సహకరించవద్దని ముందుగానే ప్రజలను హెచ్చరిస్తున్నారు పోలీసులు.

https://ntvtelugu.com/why-did-ntr-miss-out-rrr-success-party/
Exit mobile version