NTV Telugu Site icon

Telangana Police: బాసూ మీరు మ..మ..మాస్.. ఫుల్ జోష్ లో డ్యాన్స్ ఇరగ దీసిన పోలీసులు

Telangana Police

Telangana Police

Telangana Police: హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీలో లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. హైదరాబాద్ నలుమూలల నుంచి వస్తున్న బొజ్జ గణపయ్యలతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు సందడిగా మారింది. నిమజ్జనాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ‘గణపతి బప్పా మోరియా’, ‘జై బోలో గణేష్ మహారాజ్’ నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. ట్యాంక్‌బండ్‌పై ఎక్కడ చూసినా జనంతో నిండిపోయింది. ఖైరతాబాద్ గణేష్ ఎదుట భక్తులతో పాటు పోలీసులు కూడా తీన్మార్ స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. భక్తులతో కలిసి తీన్ మార్ స్టెప్పులు వేస్తూ అందరిని ఆకర్షించారు. పోలీసులు అందరూ ప్రజలతో మమేకమై డ్యాన్సుల చేస్తుంటే అక్కడి వచ్చిన వారందరూ ఆశక్తిగా పోలీసులు చేస్తున్న డ్యాన్స్ ను ఆనందంగా తలికించారు. పోలీసులు ఫుల్ జోస్ లో తీన్ మార్ డబ్బులకు స్టెప్పులు వేస్తూ ఆనందంగా గడిపారు. పోలీసులను చూసిన అక్కడి జనం బాసూ మీరు మ..మ.. మాస్ పోలీస్.. ఫ్రెండ్లీ పోలీస్ అంటూ విజిల్స్ వేస్తూ పోలీసులకు ఉత్సాహాన్ని నింపిన తీరు ఆహ్లాద వాతావరణం నింపింది.

Read also: Kokapet-Budvel: కేక పుట్టించిన కోకాపేట, బుద్వేల్ భూముల వేలం.. రూ. 6.5 కోట్ల ఆదాయం

బాలాపూర్ గణేశ శోభాయాత్ర కూడా కొనసాగుతుంది. పాతబస్తీ, చార్మినార్‌, ఎంజీ మార్కెట్‌ మీదుగా బాలాపూర్‌ హుస్సేన్‌ సాగర్‌ చేరుకుంటుంది. అనంతరం బాలాపూర్‌ అమరవీరుని హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. అంతకు ముందు ఖైరతాబాద్ మహా గణేశుడి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఉదయం 6.30 గంటలకు గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. గణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా సాగింది. అనంతరం ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్‌కు చేరుకుంది. ఖైరతాబాద్‌ బడా గణేష్‌ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్‌ నంబర్‌ 4 దగ్గర పూజల అనంతరం నమజ్జనం చేశారు. అంతకుముందు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ముగింపు కార్యక్రమం జరిగింది. అయితే ఈసారి ముందుగానే చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.
Telangana BJP: తెలంగాణంలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ రె’ఢీ’.. వచ్చే నెలలో షెడ్యూల్ ఇదే..

Show comments