NTV Telugu Site icon

Telangana:అక్ర‌మ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం.. భారీ నిషేధిత గుట్కా స్వాధీనం

Nizamabad Hanumakonda

Nizamabad Hanumakonda

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిషేధిత గుట్కా, జర్దాను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కెఆర్ నాగరాజు వివరాలు వెల్లడించారు. కొంద‌రు సమాచారం ఇవ్వ‌డంతో.. టాస్క్ ఫోర్స్, సీసీఎస్ ల అధ్వర్యంలో లైన్ గల్లీలో దాడులు నిర్వహించామని తెలిపారు.

నిర్వాహకులు మహమ్మద్ అబుబకర్, షేక్ నేహల్ ఇద్దరి కిరాణషాప్, గోదాంలలో నిషేధిత గుట్కా జర్దాను సీజ్ చేసినట్లు చెప్పారు. వీటి విలువ సుమారు 10 లక్షల 90 వేలకు పైగా నిషేధిత గుట్కా, జర్దా ఉంటుందని సిపి నాగరాజు స్పష్టం చేశారు. గతంలోను అబు బకర్ పై సస్పెక్ట్ షీట్ కేసు ఓపెన్ చేసి ఉందని తెలిపారు. వీరిపై 1420,1558,469, 307, వీటితో పాటు మరో 14 సెక్షన్స్ నమోదు చేశామని తెలిపారు. ఒకే సంవత్సరంలో మూడు సార్లు కేసు నమోదు అయితే పిడి యాక్టు కేసు ఓపెన్ చేస్తామని సిపి నాగరాజు వెల్లడించారు..

కాగా.. ఇలాంటి ఘ‌ట‌నే.. హనుమకొండ జిల్లా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అక్రమంగా రవాణా చేస్తున్న జిలిటన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ ను వరంగల్ టాస్క్‌పోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సప్లయ్ చేసే ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ. 52వేలు విలువ చేసే జిలిటన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనటర్స్ స్వాధీనపరుచుకున్నట్లు టాస్క్‌పోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సిఐలు సంతోష్ , జి. శ్రీనివాస్ , ఎస్.ఐ లవన్ కుమార్ మ‌రియు సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.

SI Suicide: గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య