Police Bust Two Prostitution Houses In Banjara Hills: అది ఒక మసాజ్ సెంటర్. బయటి నుంచి ఎవరు చూసినా, అదొక మసాజ్ సెంటరేనని అనుకుంటారు. కానీ.. లోపలికి వెళ్లి చూస్తే మాత్రం, దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎందుకంటే.. లోపల జరుగుతోంది మసాజ్ కార్యకలాపాలు కాదు, వ్యభిచారం. మసాజ్ సెంటర్ పేరుతో, అందులో గుట్టుగా వ్యభిచారం నడుపుతున్నారు. తమ గుట్టు ఎప్పటికీ తెలియదని నిర్వాహకులు అనుకున్నారు కానీ, మొత్తానికి వారి బండారం బట్టబయలైంది. ఒకరు సమాచారం అందించడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, అందరినీ అడ్డంగా పట్టుకున్నారు. ఈ తతంగం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
MLA Rajaiah: కడియం శ్రీహరి ఎన్‌కౌంటర్ల సృష్టికర్త.. పార్టీ నుండి సస్పెండ్ చేయాలి
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో సునీల్ కుమార్ అనే ఓ వ్యక్తి ‘మహి ఆయుర్వేదిక్ బ్యూటీ స్పా సెలూన్’ పేరుతో ఒక మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కానీ.. లోపల మాత్రం అతడు చేయించేది మాత్రం పాడుపని. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిల్ని రప్పించి, మసాజ్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నాడు. బయట మసాజ్ బోర్డు ఉంది కదా, లోపల జరుగుతున్న వ్యవహారాన్ని ఎవ్వరూ పసిగట్టలేరని.. అతడు ఇన్నాళ్లూ భ్రమపడ్డాడు. కానీ, ఈ గుట్టు గురించి ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. పోలీసులు ఆ సెంటర్‌పై వెంటనే దాడులు చేశారు. లోపల జరుగుతున్న తంతుని చూసి ఒక్కసారిగా హడలెత్తిపోయారు. సునీల్‌కుమార్‌తో పాటు సబ్ ఆర్గనైజర్ ఫర్జానా బేగంను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. అలాగే ముగ్గురు విటులను అదుపులోకి తీసుకొని, యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు.
Madhu Yaskhi Goud: తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది.. భోగం బిఆర్ఎస్ పార్టీది
సరిగ్గా ఇలాంటి సంఘటనే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లో కూడా చోటు చేసుకుంది. ఆర్‌కే రెసిడెన్సీ పెంట్‌హౌజ్‌లో జెన్నత్ సెలూన్ అండ్ స్పా ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు.. బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. పోలీసులు వెంటనే దాడులు చేసి, నిర్వాహకులైన రత్లావత్ విజయ్‌బాబుని అరెస్ట్ చేశారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఉత్తరాది ప్రాంతాల నుంచి యువతుల్ని రప్పించి, స్పా సెంటర్లో అతడు వ్యభిచారం చేయిస్తున్నట్లు విచారణలో తేలింది.
