Site icon NTV Telugu

Constable Candidates Protest: అర్ధరాత్రి గాంధీభవన్‌లో ఉద్రిక్తత.. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల దీక్ష భగ్నం

Constable

Constable

Constable Candidates Protest: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనను భగ్నం చేశారు పోలీసులు.. ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మురి వెంకట్, కార్పొరేటర్ విజయ రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులను అరెస్ట్ చేశారు.. అయితే, మాకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు.. 1600/800 మీటర్ల పరుగు పందెంలో క్వాలిఫై అయిన అభ్యర్థులను.. ఎగ్జామ్ రాసేందుకు అనుమతించాలని ఆందోళనకు చేశారు.. లాంగ్ జంప్ , షాట్ పుట్ గతం కంటే ఎక్కువ పెంచడం వల్ల మాకు అన్యాయం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గాంధీ భవన్‌ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు.. అభ్యర్థుల ఆందోళనను భగ్నం చేశారు.. గాంధీ భవన్‌కు తాళాలు వేశారు..

Read Also: Sri Ganesha Sahasranama Stotram LIVE : ఈ స్తోత్రాలు వింటే తలపెట్టిన ఎటువంటి కార్యక్రమాలైన సకాలంలో నెరవేరుతాయి

ఇక, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనపై కాంగ్రెస్‌ నేత మల్లు రవి మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మందికి అన్యాయం జరిగిందన్నారు.. లాంగ్ జంప్ 3.8 మీటర్స్, షాట్ పుట్ పెంచారు.. మిగతా రాష్ట్రాలలో పరిస్థితి ఇలా లేదన్న ఆయన.. పెంచిన వ్యాయామ పరీక్షల వల్ల 2.8 లక్షల మంది డిస్ క్వాలిఫై అయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.. ఎంతో కటినంగా ఉన్నాయి ఈ వ్యాయామ పరీక్షలు.. రన్నింగ్ లో క్వాలిఫైడ్ అయిన అందరికీ ఎగ్జామ్ రాయించే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూస్తామన్న ఆయన.. దీనిపై గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కోరాం.. యూత్‌ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తారు.. పాత పద్ధతిలో సెలక్షన్స్ ప్రాసెస్ జరపాలి అనేది తమ డిమాండ్‌గా తెలిపారు మల్లు రవి.

Exit mobile version