NTV Telugu Site icon

Justice for SI-Constable: ఛలో డీజీపీ’ ముట్టడిలో పోలీసుల లాఠీ ఛార్జ్.. బండి సంజయ్‌ సీరియస్‌

Bnadi Sanjay

Bnadi Sanjay

Justice for SI-Constable: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేవైఎం నాయకులు చేపట్టిన ‘ఛలో డీజీపీ’ ముట్టడి కార్యక్రమం పోలీసులు రాక్షసంగా వ్యవహరించారు. డీజీపీ ఆఫీస్ లోకి వెళ్లేందుకు యత్నించిన బీజేవైఎం నాయకులను ఈడ్చి వేశారు. లాఠీ ఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాటలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ స్ప్రుహ తప్పి పడిపోయారు. అయినా పోలీసులు విచక్షణారాహితంగా భాను ప్రకాశ్ లాఠీలు ఝుళిపించారు. ఈడ్చుకెళ్లి వ్యాన్ లో పడేశారు. ఈ సంఘటనలో భాను ప్రకాశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బీజేవైఎం నాయకులు గ్లోబెల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు భాను ప్రకాశ్ తరలించిన వైద్య చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనలో భాను ప్రకాశ్ తోపాటు అరుణ్ కుమార్, పుల్లెల శివ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

Read also: KTR: తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్‌తో మొట్ట మొదట నడిచింది నిజామాబాద్ జిల్లా

కరీంనగర్ పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే బీజేవైఎం నాయకులకు ఫోన్ చేసి భాను ప్రకాశ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో లక్షలాది మంది అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్న సరిదిద్దాలని ఆందోళన చేస్తే అమానుషంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడ్డారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించని చేతగాని కేసీఆర్ సర్కార్ ప్రశ్నించే వాళ్లను అణిచివేయడానికి యత్నిస్తోందన్నారు. కేసీఆర్ సర్కార్ కు పోయేకాలం దాపురించిందని, నిరుద్యోగుల ఉసరు తగలక తప్పదని పేర్కొన్నారు.
Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా..

Show comments