Site icon NTV Telugu

CP Mahesh Bhagwat: షోరూమ్ లో ఫింగర్ ప్రింట్స్.. అదుపులో అంతర్‌ రాష్ట్ర నేరస్తులు

Cp Mahesh Bhagwat

Cp Mahesh Bhagwat

CP Mahesh Bhagwat: హైదరాబాద్‌ లోని కుషాయిగూడ పోలిస్ స్టేషన్ పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. వారి వద్దనుంచి 70 లక్షల విలువైన మొబైల్ ఫోన్‌ల రికవరీ చేసారు. జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అంతర్ రాష్ట్ర నేరస్తుల అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత నెల 21 న కుషాయిగూడ పోలిస్ స్టేషన్ పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ చోరీ జరిగిందని, 70 లక్షల విలువైన 432 సెల్ ఫోన్లు చోరీ గురైనట్లు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశామన్నారు. సీసీఎస్, ఎస్ఓటి, క్లూస్ టీమ్, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ పోలీసులతో టీమ్ ఏర్పాటుచేసినట్లు మహేశ్ భగవత్ అన్నారు. వెంటిలేటర్ ద్వారా లోపలికి వచ్చి చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. 500 సీసీ కెమెరాలు స్కాన్ చేశామని తెలిపారు. షోరూమ్ లో ఫింగర్ ప్రింట్స్ సేకరించామని, షోరూమ్ సిబ్బందిని కూడా విచారించామన్నారు. ఒక చిన్న సమాచారం వచ్చింది, జార్ఖండ్ కు చెందిన ముఠా అని అర్థమైందని మహేశ్ భగవత్ తెలిపారు.

Read also: మీ మూడ్, శక్తి పెరగాలా..? అయితే ఈ 8 ఫ్రూట్స్ ట్రై చేయండి..

ఒక‌ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యిందని, ఆ ప్రింగర్ ప్రింట్ సహాయంతో.. మహారాష్ట్ర కు చెందిన ఓ కేసులో ఒక బాల నేరస్తుడికి చెందిన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యిందని అన్నారు. అప్పుడు ఓ కొలిక్కి వచ్చి జార్ఖండ్ కు చెందిన ముఠా చేసినట్లు గుర్తించామన్నారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక టీమ్ ను పంపించామని తెలిపారు. చోరీ చేసిన సొత్తును ఈ ముఠా నేపాల్, బంగ్లాదేశ్ కు పంపిస్తారని పేర్కొన్నారు. వారం రోజుల తరువాత సత్తార్ షేక్ ను పట్టుకున్నామని తెలిపారు. షోరూమ్ లో చోరీ కి గురైన మొబైల్ ను అతని దగ్గర స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం ఆరుగురు చోరీ కి వచ్చారని పేర్కొన్నారు. మరో పోలీస్ టీమ్ అసిదుల్ షేక్‌ను పట్టుకున్నారని, అక్కడి నుండి పీపీ వారెంట్ పై తీసుకువచ్చామని మహేశ్ భగవత్ తెలిపారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం అంత సులభం కాదన్న ఆయన పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కాల్పులు జరిపే అవకాశం ఉందని అన్నారు. ఈ కేసు లో ఫింగర్ ప్రింట్ దొరకడం చాలా ఇంపార్టెన్స్ ఉందని, వ్యాపారులు అలారం సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాలని సలహాఇచ్చారు. క్లూస్ టీమ్ అధికారి మాట్లాడుతూ.. చోరీ జరిగిన తరువాత 24 గంటలు షోరూమ్ లోనే ఉండి అణువణువు గాలించామని తెలిపారు. చివరకు ఒక చిన్న ఫింగర్ ప్రింట్ దొరికడంతో వారి పని సులువైందని అన్నారు. ఆ వివరాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఇచ్చామని, మొత్తం పది టీమ్ లు ఏర్పాటు చేశామని చిరవకు దొంగలను పట్టుకున్నామని వివరించారు.
Free Ration: రేష‌న్‌కార్డుదారులకు శుభవార్త.. మరోసారి 10 కిలో ఉచిత బియ్యం పంపిణీ

Exit mobile version