NTV Telugu Site icon

Ganja Selling: వీళ్లు అత్తాకోడళ్ళా.. యవ్వారం మమూలుగా లేదుగా..!

Ganja Selling

Ganja Selling

Ganja Selling: ఈ అత్తకోడళ్ల రోజువారీ సంపాదన రూ.30 వేలు. నెలకు రూ. 9 లక్షలు. వాళ్లు చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. ఉన్నత స్థాయి వ్యాపారం కాదు. పక్కాగా చెప్పాలంటే చీకటి దండా.. వీరిద్దిర యవ్వారం మామూలుగా లేదంటారా? వీరద్దరే కాదండోయ్ కుటుంబమంతా అక్రమ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు ఈ అత్తాకోడళ్లు ఏం చేస్తున్నారంటే.. అక్రమంగా గంజాయిని విక్రయించి భారీగా ఆస్తులు సంపాదించారన్న మాట. ఎంతదాచిన దొంగ దొరక్కుండ ఉంటాడా.. చివరికి ఈ అత్తాకోడళ్ల భాగోతం బట్టబయలు కావడంతో కటకటాల వెనక్కొ వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా ఎక్కడో కాదండోయ్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో చోటుచేసుకుంది.

Read also: Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

నానక్‌రామ్‌గూడ లోధా బస్తీకి చెందిన కాళపాటి గౌతమ్‌సింగ్, అతని తల్లి కాలాపాటి నీతూభాయ్, అతని కుటుంబానికి చెందిన మరో ఆరుగురు మధుబాయి కొన్నేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. నీతూభాయ్ కుటుంబ సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉంటూ ఈ గంజాయి దందా చేస్తున్నారు. ధూల్‌పేటలో రూ. కిలో 8 వేలు.. 5 గ్రాముల ప్యాకెట్లను తయారు చేసి ఒక్కొక్కటి రూ. 250కి విక్రయిస్తున్నారు. ఇలా.. ఒక కేజీపై రూ. 50 వేలకు పైగానే ఈ ముఠా సంపాదిస్తోంది. నీతూబాయి , ఆమె కోడలు మధుబాయి కనీసం రూ. 30 వేల వరకు నెలకు రూ. 9 లక్షలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయి దందా ద్వారా వచ్చిన డబ్బుతో రూ. 4 కోట్ల ఆస్తులు కూడబెట్టారు. నీతూబాయి లంగర్‌హౌస్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో మూడంతస్తుల భవనాలు, ఖరీదైన కార్లను కొనుగోలు చేసింది. మంగళవారం బాలుడితో పాటు గౌతమ్‌సింగ్ అనే వ్యక్తి గంజాయితో ప్రయాణిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో గోల్కొండ పోలీసులతో పాటు నార్కోటిక్స్ బ్యూరో సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ ఇద్దరిని విచారించగా నీతూభాయ్, మధుబాయిల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నీతుబాయి వద్ద రూ. 40.30 లక్షలు, 16 బ్యాంకు ఖాతాల్లోని రూ.1.53 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నీతూభాయ్‌పై పలు కేసులు నమోదు కాగా, ఆమెపై పీడీ యాక్ట్ కూడా ఉంది. ఆమె కొడుకుపై కూడా కేసులు ఉన్నాయి. అయినప్పటికీ, మార్గం మార్చుకోకుండా, కుటుంబం కలిసి కొన్నేళ్లుగా గంజాయి వ్యవహరం కొనసాగిస్తోంది.
Miyapur Firing: కక్షతోనే దేవేందర్ పై రితీష్ కాల్పులు.. గొడవకు కారణమైన ఆమె ఎవరు..?

Show comments