Site icon NTV Telugu

Agnipath Protests: సికింద్రాబాద్ అల్లర్లపై ఆవులను ప్రశ్నిస్తారా?

Sec Avula

Sec Avula

అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గత వారం జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. రైల్వే ఆస్తులను భారీగా ధ్వంసం చేశారు. ఈ అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ప్రకాశం జిల్లా కంభంకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆవుల సుబ్బారావును పోలీసులు నరసరావుపేట నుంచి హైదరాబాద్‌కు తరలించినట్టు తెలుస్తోంది. ఈ అల్లర్లలో ఆవుల సుబ్బారావు నిర్వహిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీరి చెందిన అభ్యర్థులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

వాట్సప్ గ్రూపుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఆవుల పాత్రను విశ్లేషిస్తున్నారు. ఇవాళ్ఠి నుంచి హైదరాబాద్​లో ఆవుల సుబ్బారావును ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. సికింద్రాబాద్‌ అల్లర్లకు సంబంధించి పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు అనేక ఫోటోలు దిగారు. ఈ అల్లర్లలో సుబ్బారాపు పాత్ర ఉందన్న అనుమానంతో ఈ నెల 18న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఆవుల సుబ్బారావుకి చెందిన సాయి అకాడమీలో తనిఖీలు చేశారు. న‌ర‌స‌రావుపేట వ‌చ్చిన ఐటీ, ఐబీ అధికారులు ఆయ‌న అకాడెమీలో సోదాలు చేసి హార్డ్ డిస్క్, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శిక్షణ పొందుతున్న యువకుల వ్యక్తిగత వివరాలు, ఫీజుల గురించి అడిగి తెలుసుకున్నారు.

తాజాగా విచార‌ణ‌కు రావాలంటూ సుబ్బారావుకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నెల 27న విచార‌ణ‌కు రావాలంటూ ఆదేశాలిచ్చారు. దీనికి తోడు పోలీసులు విధ్వంసానికి సంబంధించి సమాచారం సేకరించేందుకు ఆవులను ప్రశ్నించనున్నారు. మరోవైపు ఈ అల్లర్లలో అరెస్టయిన విద్యార్ధుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్షమించి విడిచిపెట్టాలని, వారి భవిష్యత్తును నాశనం చేయవద్దని అధికారులను వేడుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే కేసులో మరికాసేపట్లో నిందితుల రిమాండ్ పై విచారణ జరగనుంది. సుబ్బారావు సహా 10మందిని రైల్వే కోర్టులో హాజరు పర్చనున్నారు పోలీసులు. రైల్వే పోలీసుల అదుపులో నిందితులు వున్నారు. 10 మందికి గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు పూర్తి చేస్తారు. అనంతరం వారిని తరలిస్తారు.

Film employees’ strike: సమ్మె పై ఫెడరేషన్ లో బిన్నాభిప్రాయాలు

Exit mobile version