NTV Telugu Site icon

Asifabad: దానాపూర్ లో ఉద్రిక్తత.. అటవీశాఖ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు..

Asifabad

Asifabad

ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం లాం తుంగెడ గ్రామ శివారులోని 417 కంపార్ట్‌మెంట్‌లో అటవీశాఖ అధికారులకు, వరి రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం మరువక ముందే మరో వివాదం తలెత్తింది. దానాపూర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం చేశారు. పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. న్యాయం చేయాలంటూ రోడ్డుపై రైతుల నిరసన తెలిపారు. దశాబ్దాలుగా తాము సాగు భూములను ఎలా తీసుకుంటారని మండిపడుతున్నారు. న్యాయం చేయాలని రోడ్డపై బైఠాయించారు.

Read also: Supreme court: తాగునీటి కోసం ఆప్ ప్రభుత్వం పిటిషన్.. ఏం కోరిందంటే..!

దశాబ్దాలుగా భూములను తాము సాగు చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు. ఇలా భూములు లాక్కుంటే కుటుంబంతో సహా రోడ్డున పడతామని తెలిపారు. మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. తగిన న్యాయం చేసేంత వరకు కదిలేది లేదని బీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పోడు రైతులకు శాంతిపచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. అధికారులతో మాట్లాడుతామని చెప్పడంతో పోడు రైతులు ధర్నాని విరమించారు. దీంతో అక్కడ వాతావరణం శాంతియుతంగా మారింది.
Pakistan : ఏడాది తర్వాత పాక్ జైలు నుంచి విడుదలైన తల్లీకొడుకు