Pocharam Srinivas Reddy: అసెంబ్లీ అమ్మవారి ఆలయంలో తన జన్మదినం సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. అన్నికంటే ముఖ్యమైనది మానవ జన్మ. ఎవరైతే భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఆధారంగా కానీ చేప్పే ముఖ్యమైన సందేసం ఒక్కటే ఈ జన్మలో మనం మంచి పనులు చేసి ఇతరుల మనసు నొప్పించకుండా, మోసం చేయకుండా.. సమాజం కోసం ప్రజల కోసం అనుకున్నటువంటి స్నేహితుల కోసం ఎవరైతే తపించి పనిచేస్తారో క్రోధం, కామం, లోభం నుంచి వీటన్నిటికి ఎవరైతే దూరంగా ఉంటారో మరోజన్మ ఉంటని అన్నారు. అని భగవద్గీలో శ్లోగం ఉందన్నారు. వాటన్నింటిని కూడా మనం పాటించాలని కులాలకు మతాలకు అతీతంగా ఎవరైనా సరే ముందుకు సాగాలని సూచించారు.
Read also: MMTS Services Cancelled: దేవుడా మళ్లీనా.. మొత్తం 19 సర్వీసులు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
ఈజన్మలో మనం జన్మించడం మన పూర్వజన్మ సుకృతం అన్నారు. వాస్తవానికి జన్మదిన వేడుకలు జరుపుకోకూడదని అనుకున్నామని, అనుకోకుండా ఇక్కడ ఏర్పాటు చేశారని, నాకు అత్యంత సన్నిహితుడు బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ తో 50 ఏండ్ల స్నేహం అని గుర్తుచేసుకున్నారు. నా బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ మరణం కలిచి వేసిందని తెలిపారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని అన్నారు. అందుకే నియోజక వర్గంలో జన్మదిన వేడుకలు రద్దు చేశానని స్పష్టం చేశారు. తన మిత్రుడు మరణంతో పోచారం మీడియాతో మాట్లాడుతూనే కంట తడి పెట్టుకున్నారు. తన ప్రాణిస్నేహితుడ్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన మరణాన్ని తట్టుకోలేకపోయారు. తన అంత్యక్రియలకు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్తానని అన్నారు పోచారం.
Foreign Currency: ఎయిర్ పోర్ట్ లో పోలీసులకు షాక్.. కాటన్ బాక్స్‌ను పరిశీలించగా..