NTV Telugu Site icon

Pocharam Srinivas Reddy : లాభం వచ్చే పంటలకే ప్రాధన్యత..

speaker Pocharam Srinivas Reddy

speaker Pocharam Srinivas Reddy

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో 69.52 కొట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు శంకుస్దాపన చేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు….జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాట్టు చేసిన సభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ..
తన విజ్జప్తిపై వెంటనే ముఖ్యంమంత్రి స్పందించి జీవో ఇచ్చారు వారికి నా మనస్పూర్తిగా ధన్యావాదాలు తెలిపారు. గోదావరి నీళ్లు మంజీరాకు రావడం వల్లే జాకోరాలో లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమైందని, లిఫ్ట్ నిర్మాణం పూర్తి అయితే 6వేల ఏకరాలకు సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు.

త్వరలో చందూరు లిఫ్ట్ కు కూడా శంకుస్థాపన చేస్తామని ఆయన తెలిపారు. చింతకుంటలో కూడా మోటార్లు పెట్టి చెరువులు నింపుతామని, లిఫ్ట్ లకు ప్రజలు సహాకరించాలని ఆయన కోరారు. రెండు పంటలు పండించుకునే భాధ్యత రైతన్నలదేనని, నియోజకవర్గంలో మరింత సాగునీరు అందిస్తే 15వందల కోట్లరూపాలయ డబ్బు రైతన్నజేబులోకి చేరుతుందని ఆయన అన్నారు. ఏ పంటకు డబ్బు అధికంగా వస్తుందో అదే పంట వేసి లాభం పొందాలని, పంటల సాగు చేసే విషయంలో రైతుకురైతే శత్రువు కాకుడదని ఆయన హితవు పలికారు. రైతు వేదికలను రైతులందరూ వినియోగించుకోవాలన్నారు. రైతువేదికలను పత్తాలు అడటానికి, మద్యపాన కేంద్రాలుగా మార్చొద్దని సూచించారు. అత్యధిక దిగుబడులు సాధించడంలో మా నియోజకవర్గ రైతులు అందరికి ఆదర్శమని, ఆయిల్ పామ్ కు మంచి గిరాకీ ఉంది.. రైతులు ఆదిశగా వినూత్నంగా ఆలోచించాలన్నారు.

కష్టపడే రైతన్న మరింత వినూత్నంగా ఆలోచించాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులకు సహాకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ ఆదాయాన్ని తల్లికి, భార్య వద్ద దాచుకునే సంస్క్రుతి ఆర్మూర్ రైతులది ఆ సంస్క్రుతిని
అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రైతన్న చేయి ఎప్పుడూ పైనే ఉండాలి.. అప్పులు తీసుకుని పంటలు పండించే స్దితి నుండి సొంతంగా పెట్టుబడులతో అత్యధిక లాభాలు రావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కాకుండా మిగిలిపోయినా భూమిని సాగులోకి తీసుకురావడమే నా లక్ష్యమన్నారు.