PM Rozgar Mela: పది నెలలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను మోడీ నేరుగా చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. దేశ వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో పీఎం రోజ్ గార్ మేళను మోడీ సర్కార్ నిర్వహించనుందని వెల్లడించారు. ఇవాళ పిఎం రోజ్ గార్ మేళలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం రోజ్ గార్ మేళలో మోడీ పాల్గొననున్నారు. ఇక హైదరాబాద్ లో పీఎం రోజ్ గార్ మేళలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రిక్రూట్ అయిన 71 వేల మందికి పీఎం రోజ్ గార్ మేళలో నియామక పత్రాలు జారీ కానున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మోడీ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అనంతరం 232 మందికి నియామక పత్రాలను కిషన్ రెడ్డి అందజేసారు.
కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల ఖాళీలు ఉన్నాయని తేలిందని తెలిపారు. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయి అభ్యర్థులు రోడ్డు పై పడ్డారని అన్నారు. 10 నెలలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను మోడీ నేరుగా చూస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎక్కడ అక్రమాలకు తావు లేకుండా నియామకాలు జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు అధ్బుతమైన నేషనల్ హైవే లు వచ్చాయని గుర్తు చేశారు. మోడీ పీఎం అయిన తర్వాత సెల్ ఫోన్ లు విదేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. మోడీ ,కేంద్ర మంత్రులు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. మోడీ రష్యా – ఉక్రెయిన్ యుద్ధం అపి అక్కడ భారతీయులను ఇక్కడకి తీసుకువచ్చారని అన్నారు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత యువత పేరెంట్స్ ను మరిచిపోతున్నారని అన్నారు. ఇది మన సంస్కృతి కాదని కేంద్ర మంత్రి తెలిపారు.
World’s Oldest Dog: కుక్కకు గిన్నిస్ రికార్డు.. అంత స్పెషల్ ఏంటో?
