మరోసారి తెలంగాణ పర్యటనకు సిద్ధం అయ్యారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ కు రానున్నరు ప్రధాని నరేంద్ర మోడీ… హెచ్‌ఐసీసీలో జరిగే ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని పాల్గొనబోతున్నారు.. టీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయ వార్తల తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వస్తుండడంతో మోడీ.. హైదరాబాద్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది..
Read Also: KTR: గంగవ్వకు మాట ఇచ్చిన కేటీఆర్.. నాకేం ప్రాబ్లం లేదు.. మహేష్ బాబు ఫీల్ అవుతారు..!
కాగా, ఈ నెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (UNWGIC 2022) సదస్సు జరగనుంది.. 11వ తేదీన ఈ సదస్సులో పాల్గొననున్నారు నరేంద్ర మోడీ.. అయితే, ఈసారి పర్యటనలో అధికారిక కార్యక్రమానికే పరిమితం అవుతారా? లేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.. అసలే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితి నడుస్తోంది.. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు దసరా రోజు జాతీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోడీ.. హైదరాబాద్ పర్యటనలో పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ కూడా ఉండవచ్చు అనే చర్చ సాగుతోంది. కాగా, జులైలోనే హైదరాబాద్ వచ్చారు నరేంద్ర మోడీ… బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేథప్యంలో రెండో రోజుల పాటు భాగ్యనగరంలోనే బస చేశారు.. జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లోనే ఉన్నారు.. జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.. ఆ తర్వాత ఏపీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.