తెలంగాణ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ దేశంలో పచ్చదం పెంచడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో సీనీ, రాజకీయ, వ్యాపారవేత్త ప్రముఖులు పాల్గోని మొక్కలు నాటారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రధాని మోడీ సంతోష్ కుమార్‌ను ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ సంతోష్ కుమార్ కు ప్రధాని మోడి లేఖ రాశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతపై వృక్షవేదం పుస్తకం గురించి లేఖలో ప్రస్తావించారు. ప్రకృతితో మన అనుబంధాన్ని తెలిపిన పుస్తకం వృక్షవేదం అని, పచ్చదనం దిశగా యువత ముందుకు వెళ్లాలని ప్రధాని పేర్కొన్నారు.
ఎంపీ సంతోష్‌కుమార్ కు ప్రధాని లేఖ…
